మలేరియాపై అధికారుల అప్రమత్తం

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నంసాక్షి): వర్షాకాలంలో విజృంభించే అంటురోగాలతో పాటు మలేరియాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులు హెచ్చరించారు. వైద్యశాఖ మంత్రి జి/-లలాకు చెందిన వాడే కావడం,ఇటీవల మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హెచ్చరిక చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కువగా మలేరియా, ఇతర జ్వరాలు ప్రబాలే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా మలేరియా అధికారి రవిశంకర్‌ సూచించారు. ఈ సారీ గత ఏడాది కంటే తక్కువగా కేసులు నమోదు అయ్యే విధంగా చూడాలని అన్నారు. దీనిపై  ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు కూడా మలేరియా జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.  గ్రామాల్లో ఎక్కడ కూడా నీటి నిల్వలు లేకుండా చూడాలని సూచించారు. నిల్వ ఉంటే దోమలు ఎక్కువగా ఉండి మలేరియా వంటి రోగలు ప్రభలే అవకాశం ఉందని అన్నారు. గ్రామాల్లో గోడలపై స్పే నిర్వహించాలని సూచించారు. మలేరియాపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ర్యాలీలు, విద్యార్థులకు మలేరియా అంశంపై వ్యాసరచన, క్విజ్‌ తదితర పోటీలు నిర్వహించాలని అన్నారు.