మల్కపేట రిజర్వాయర్‌కు పాలనా అనుమతి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి జలాల నిల్వ కోసం రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రిజర్వాయర్ నిర్మాణానికి పాలనా అనుమతి ఇచ్చింది. కొన్నిరోజుల కిందటే ఐదు భారీ రిజర్వాయర్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్‌కు పాలనా అనుమతినిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌లో ఈ రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 0.35 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రభుత్వం రీడిజైనింగ్‌లో భాగంగా దీని సామర్థ్యాన్ని మూడు టీఎంసీలకు పెంచింది. దీనిని రూ. 553.10 కోట్లతో నిర్మించేందుకు అంచనాలు రూపొందించింది.