మళ్లీ కోల్డ్‌ స్టోరేజికి మహిళా బిల్లు

మహిళా ఎంపిల మనోగతాన్‌ ఇన పట్టించుకోని మోడీ

బిజెపి వైఫల్యానికి అద్దం పట్టిన బిల్లు

న్యూఢిల్లీ,జనవరి7(జ‌నంసాక్షి): సంపూర్ణ మెజార్టీ ఉన్నా మహిళా బిల్లుకు మాత్రం ఈ సమావేవాల్లోనూ మోక్షం దక్కలేదు. దీనిని గట్టెక్కించడంలో కనీసం ప్రస్తావన కూడా జరగలేదు. రాజ్యసభలో దీనిపై చర్చ జరిగినా ఎందుకనో దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ది ప్రదర్శించలేదు. దీంతో దఫా కూడా మహిళా రిజర్వేషన్లు లేకుండానే సార్వత్రిక ఎన్‌ఇనకలకు వెళ్లాల్సిన ఆగత్యం ఏర్పడింది. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత గట్టెక్కుతాదనుకుంన మహిళా బిల్లు కూడ దాదాపు అటకెక్కినట్లుగానే భావించాలి. రాజ్యసభలో జయభాదురి, కనిమొళి తదితరులు బిల్లు ఆవశ్యకతపై చర్చి చేశారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పించలేదు. శీతాకా సమావేశాల తరవాత ఇక ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మాత్రమే ఉంటాయి. ఈ సమావేశాల్లో బిల్లు వచ్చినా చేసేదేవిూ లేదు. మరో నాలుగునెలల్లో ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బిల్లును గట్టెక్కించి, ఓ మంచి కార్యం చేశామన్న భరోసా కల్పించలేక పోయారు. మొత్తంగా ఈ బిల్లు ఇక అటెక్కినట్లుగానే భావించాలి. బిజెపి కూడా మహిళా బిల్లును తీసుకుని రాలేకపోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. మహిళా బిల్లును ఆమోదించక పోవడం బిజెపి ఘోర వైఫల్యంగానే చూడాలి. ఎన్నో ఆదర్శాలు వల్లించిన మోడీ సర్కార్‌ ఈ విషయంలో ఘోర వైపల్యాన్ని ప్రదర్శించారు. మోడీ మనసులో మహిళా బిల్లుకు సంబంధించిన ఆలోచనలు వెల్లడి కావడం లేదు. దీంతో గత నాలుగేళ్లుగా ఇది కోల్డ్‌ స్టోరేజిని దాటి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో సగం శాతం మంది మహిళలు కోరకుంటున్న మహిళా బిల్లుపై స్పష్టం చేయడం లేదు. భారత రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా గత రెండు దశాబ్దాలుగా మహిళా బిల్లు మాత్రం గట్టెక్కలేకపోతోంది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ ఉన్నా మోడీ ప్రబుత్వం దీనిని ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం లేదు. మోడీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయినా మహిళా బిల్లుకు అతీగతీ లేదు. ఇన్ని అవరోధాల మధ్య కూడా తమతమ రంగాలలో శక్తిమంతమైన మహిళగా నిరూపించుకుంటూనే ఉంది. వ్యక్తిత్వ హననం జరుగుతున్నా.. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం. మహిళా సమానత్వమే సమాజానికి హితం చెబుతున్న పాలకులు సమాన గౌరవం ఇచ్చి చట్టసభల్లో ప్రవేశించేలా చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. మహిళల్లో స్ఫూర్తిని నింపడమే గాకుండా, వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో పురుష సమాజం విఫలమయ్యిందనడంలో సదేహం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షలపై స్పందించడం లేదు. త్వరలోనే మహిళల రిజర్వేషన్లపై ముందుకు సాగుతామన్న ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. పాలనలో వారికి భాగస్వామ్యం కల్పించకుండా వారిని అణగదొక్కే కుట్రల్లో బిజెపి కూడా ముందే ఉంది. మహిళా సాధికారతతో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాలన సాగాలి. చట్టసభల్లో మూడోవంతు రిజర్వేషన్లు ఎవరి దయాధర్మంగానో కాకుండా హుక్కుగా, సగౌరవంగా లభించాల్సి ఉంది. మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్య పడుతుంది. ఏకాభిప్రాయ సాధన, ఉపకోటా పేరిట ఇంతకాలం రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే రాజ్యసభామోదం పొందిన మహిళాబిల్లుకు లోక్‌సభలో మద్దతు పలికే పార్టీల్ని కూడగట్టే యత్నాలను చేయాలి. మహిళల హక్కుల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోకుండా చూడాలి. ప్రజాస్వామ్యంలో కేవలం అధికారపక్షమే కాదు ప్రతిపక్షాలకూ, ప్రజలందరికీ పాత్ర ఉంటుంది. ఇది గమనించి అందరూ ముందుకు సాగాలి. ప్రభుత్వాలు ఏకపక్ష ధోరణితో మహిళలను విభజించి పాలించే తీరు పక్కన పెట్టకుంటే అది ఎంత మాత్రం సాధికారత సాధనకు ఉపయోగపడదు. మహిళా సాధికారత సంగతేమో వారి కనీస హక్కులు మృగ్యమయ్యాయి. స్త్రీలు, విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలపై దాడులను యథేచ్ఛగా కొనసాగిస్తూ, వారి హక్కులను కాలరాస్తూ, మహిళా సాధికారత సాధిస్తామనడం సరికాదు. భారతీయ సమాజం విలువలు కాపాడేలా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి రాజకీయంగా హక్కుల కల్పనకు పోరాడాలి. ఎన్ని చట్టాలు చేసినా మృగాళ్ల మదోన్మాదం, కుటుంబ సభ్యుల కామ దాహం, అధికారులు, స¬ద్యోగుల వికృత చేష్టలు వాళ్ల పాలిట శాపాలవుతున్నాయి. దీనికి తోడు మత ఛాందసవాదం మహిళా సమానత్వానికి మరింత హానికరంగా తయారైంది. భ్రూణ హత్యల కారణంగా దేశంలో క్షీణిస్తున్న అమ్మాయిల నిష్పత్తి ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఏటా జరుపు కుంటున్నా, మహిళలకు సమానహక్కులు, వారికి ప్రాతినిధ్యం వంటి విషయాల్లో ఇంకా మనం వెనకబడే ఉన్నాం. వారిని ముందుకు వెళ్లకుండా వెన్నక్కి నెట్టేస్తూనే ఉన్నాం. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఎందుకనో రాజకీయంగా ముందుకు సాకుండా అణగదొక్కు తున్నారు. ఇలా వారిని అణచి వేయడం వల్ల 50శాతం జనాభా ఆకాంక్షలను కాలరాస్తున్న వారు అవుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మహిళా బిల్లును గట్టెక్కిం చాలని ప్రధాని మోడీకి లేఖరాశారు. దీనిపై ఔనని లేదా కాదని కూడా సమాధానం రాలేదు. మన్‌కీ బాత్‌లో కూడా ఎందుకనో మహిళల గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.