మహాకూటమి అదో మాయలకూటమి

– టిఆర్‌ఎస్‌తోనే అభివృధ్ది సాధ్యం
– మరోసారి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ తరహాలో అభివృధ్ది
– టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సోమారపు సత్యనారాయణ వెల్లడి
గోదావరిఖని, నవంబర్‌ 18, (జనంసాక్షి) :
అనైతిక పార్టీలు అన్ని ఏకమై మహాకూటమి అని పేరుపెట్టుకుని జనాలను మళ్లీ మోసం చేయడానికి చూస్తున్నారని, మహాకూటమి అదో మాయలకూటమని, దాన్ని నమ్మే పరిస్థితి లేదని రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సోమారపు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సత్యనారాయణ ఎన్టీపీసీ పరిధిలోని నర్రశాలపలి, ఆటోనగర్‌, పికె.రామయ్యకాలనీలలో ఆదివారం రోడ్‌-షో, పబ్లిక్‌ మీటింగ్‌లలో ఆయన, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి మాట్లాడారు. మహాకూటమి అదో మోసపూరిత కూటమి అని విమర్శించారు. ఏ మొఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. దాదాపు 70 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్‌, టిడిపిలతో ఒరిగేది ఏంలేదన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని మళ్లీ మీ ముందుకు వస్తున్నారని, వారిని నమ్మవద్దని కోరారు. పిల్లి, ఎలుకకు పడదని, అలాంటి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టిడిపితో పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఇది ప్రకృతి విరుద్దమని పేర్కొన్నారు. అధికారం కోసం కాంగ్రెస్‌, టిడిపి నాయకులు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని ముంచిన కాంగ్రెస్‌, టిడిపిలను జనాలు నమ్మవద్దని కోరారు. అధికారం రావడంలేదని గ్రహించిన మహాకూటమి నాయకులు రూ.కోట్లు గుమ్మరిస్తున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా స్థానికంగా కొంతమంది నేరచరితులు ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని, వారిని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. వారు అధికారంలోకి వస్తే అసలు రూపం బయటపడుతుందన్నారు. వారికి ఓట్లు వేయవద్దని, అభివృద్ది చేతకాని వారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో తనను గెలిపించాలని, కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. తాను గెలిస్తే రెండింతల అభివృద్ది సాధిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రాజిరెడ్డి, నూనె కొంరయ్య, వడ్డెపల్లి శంకర్‌, జాన్‌ కెనడి, బేబి శ్రీను, రామగుండం మున్సిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ జాలి రాజమణి, టిఆర్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాల నాయకులు చెప్యాల రామారావు, డాక్టర్‌ ముస్తఫా, కోదాటి ప్రవీణ్‌, కత్తరమల్ల సుజాత, రమేష్‌, అనంతరావు, సమ్మయ్య, మామిడాల చంద్రయ్య, కస్తూరి సత్యప్రకాశ్‌, రమణారెడ్డి, మాదాసు రాంమూర్తి, ప్రకాశ్‌, సురేశ్‌, గోపాల్‌, రాసపల్లి శంకర్‌, పుష్పలత, శంకర్‌, కుసుమ, రాజయ్య, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.