మహారాష్ట్ర ఘటనతో అప్రమత్తం అయిన పోలీస్‌

తొలిదశ ఎన్నికల కారణంగా గట్టి నిఘా
ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి): మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చి 15మందిని హతమార్చిన ఘటనతో రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. మహారాష్ట్రకు పొరుగునే ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు ఉనికి కోసం ఘటనకు పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.  6వ తేదిన మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మరింత పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని మాజీ మిలిటెంట్లను అదుపులోకి తీసుకుంటున్నారు. వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. టా/-గ్గం/ట్లకు సూచనలు చేస్తున్నారు.మహారాష్ట్ర సరిహద్దులోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు ఉనికి కోసం సంచనాలకు పాల్పడే అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు. రామగుండం కమిషరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో చిన్నచిన్న ఘటనలు జరిగితే అధికారులతో చర్చించకుండా వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లవదంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వాహనాల వినియోగంపై సూచనలు చేశారు. అవసరమైతే సమస్యాత్మాక ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల వాడకంపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం వచ్చినా ఉపేక్షించవద్దంటూ పేర్కొన్నారు. గ్రేహౌండ్స్‌ బలగాలను రంగంలోకి దించారు.