మహిళలకు రక్షణ  ప్రతిఒక్కరి బాధ్యత

డ్యాం కట్టపై వాకింగ్‌ చేసిన పోలీస్‌ కమిషనర్‌
కరీంనగర్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): సమాజంలో మహిళలకు రక్షణ కల్పించడం పోలీస్‌ల బాధ్యతని, అయితే  మిగతా వారంతా చేతులు ముడుచుకుని కూర్చోవడం సరికాదని మహిళల రక్షణ ప్రతి ఓక్కరి బాద్యతని పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరశివారులోని ఎల్‌ఎండి కట్టపై నగర కవిూషనర్‌ శశాంక్‌/-తో కలిసి మార్నింగ్‌ వాక్‌ చేశారు. ఈసందర్బంగా  లేక్‌పోలీస్‌ ఏర్పాటు తర్వాత మానేర్‌ డ్యాం, ఉజ్వల పార్క్‌, జింకల పార్క్‌ ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు నియంత్రణలోకి రావడంతో ఏర్పడిన స్వేచ్చాయుత వాతావరణంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మార్నింగ్‌ వాక్‌ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. మానేర్‌ డ్యాం కట్ట చివరి ప్రాంతం సప్తగిరి కాలని నుంచి డ్యాం నుంచి నీరు విడుదలయ్యే  గేట్ల వరకు 4.5 కిలోవిూటర్ల దూరం కాలినడక నిర్వహించారు. దాదాపు 500 మంది వివిద వర్గాలకు చెందిన వాకర్స్‌ ఈకార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నడకను కొనసాగిస్తూ తటస్థపడిన వాకర్స్‌ తో పోలీస్‌ కవిూషనర్‌ ముచ్చటించారు. లేక్‌ పోలీస్‌ ఏర్పాటుకు ముందు ప్రస్తుతం ఏర్పడిన వాతావరణంపై అడిగి తెలుసుకున్నారు. మానేర్‌ డ్యాం, ఉజ్వల పార్క్‌, జింకల పార్క్‌ ప్రాంతాలకు మహిళలు అర్దరాత్రి వచ్చినా అభద్రతా భావానికి లోనుకాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లేక్‌ పోలీస్‌లు గస్తీ రేయింబవల్లు కోనసాగుతుందన్నారు. సేఫ్‌ అండ్‌ స్వేచ్చ మానేర్‌లో అన్ని వర్గాల ప్రజలు బాగస్వాములు కావాలన్నారు. మానేర్‌ డ్యాం ప్రాంతంలో బహిర్బూమికి వెల్లి వ్యర్థ
పదార్థాలను పడేసే వారికి వాకర్స్‌ అసోసియేష్‌ ఆద్వర్యంలో సదరు వ్యక్తులకు పూలదండలు వేసి సన్మానించి నియంత్రిస్తామన్నారు. ఉదయం వేలల్లో కూడా డ్రోన్‌ కెమెరాలను డ్యాం తీరంలో తిప్పనున్నామన్నారు. లేక్‌ పోలీస్‌లకు కేటాయించిన ఒక ఇంటర్‌ సెప్టర్‌ ఒక వాహనంతోపాటు మరో నూతన వాహనాన్ని కేటాయించ నున్నామన్నారు. లేక్‌ పోలీస్‌కు 6 లక్షలు నిదులిచ్చిన ఎంపి వినోద్‌కుమార్‌కు కమలాసన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్‌కవిూషనర్‌ శశాంక మాట్లాడుతూ మానేర్‌డ్యాం ప్రాంతంలో సరికోత్త వాతావరణం ఏర్పడిందన్నారు. లేక్‌పోలీస్‌లు ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. పరిశుభ్రత పాటించాలనే తపన ప్రతి పౌరునిలో ఏర్పడాలన్నారు. అన్నివర్గాల ప్రజల సహకారంతో పరిశుభ్రమైన కరీంనగర్‌ అవతరించనుందన్నారు. సందర్శకులు ఇబ్బుందలు పడకుండా స్వచ్చత కోసం మానేర్‌ డ్యాం ప్రాంతంలో రెండుచోట్ల మరుగుదోడ్లను శాశ్వత చెత్త డబ్బాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇదిలా ఉండగా మానేర్‌ డ్యాం ప్రాంతంలో అసాంఘీక కార్యకలాపాల నియంత్రణకు సిసి కెమెరాల ఏర్పాటు కోసం కేశరెడ్డి 50వేలు, రిటైర్డ్‌ ఉద్యోగి శివప్రసాద్‌ రెండు కెమెరాల ఏర్పాటు, అబ్దుల్‌ గఫార్‌ పదివేలు ఇవ్వనున్నామని ప్రకటించారు. లేక్‌ పోలీస్‌ విదినిర్వహణ కోసం రెండు అత్యాదునిక సైకిల్లను అందచేయనున్నామని మెడికల్‌ లైన్‌ వ్యవస్థాపకులు కూడలి శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎసిపిలు వెంకటరమణ, శ్రీనివాస్‌, సిఐలు తుల శ్రీనివాస్‌రావు, మహేశ్‌గౌడ్‌, విజయ్‌కుమార్‌, కరుణాకర్‌ రావు, సదానందం, ఆర్‌ఐ గంగాదర్‌, లేక్‌ఎస్‌ఐ రవి తదితరులు పాల్గొన్నారు.