మహిళా ప్రజాప్రతినిధులకు ఆదర్శం మన వీరవనిత చాకలి ఐలమ్మ

— జడ్పీటీసీ స్వప్నభాస్కర్
జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనంసాక్షి)న్యాల్కల్ మండలం, హద్నూర్ గ్రామంలో రజక సంఘాము ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చాకలి ఐలమ్మ జయంతి ‘వేడుకల్లో పాల్గొన్న జడ్పీటీసీ స్వప్నభాస్కర్, ఎంపీపీ అంజమ్మ..ఈ సందర్భంగా జడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తినీ ప్రపంచానికి చాటిచెప్పిన మన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం అంటూ, ఆమె మనందరికీ ఆదర్శం అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వినయ్ కుమార్ ,ఎంపీటీసీ సలీం, ఉప సర్పంచ్ షబ్బీర్ ఖాన్,సర్పంచ్ లు మహిపాల్, నిరంజన్ రెడ్డి,శేఖర్రెడ్డి,పీటర్,చంద్రన్న,మాజీ సర్పంచ్ స్వామిదాసు,గ్రామ తెరాస నాయకులు బక్కారెడ్డి, మహేష్, అనిల్ మరియు రజక సంఘాము సభ్యులు తదితరులు పాల్గొన్నారు