మాట్లాడుతున్న రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు

ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ప్రాణం

ప్రాణం కాపాడుకోవాలంటే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి

రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు

మంచిర్యాల బ్యూరో, నవంబర్‌ 11, (జనంసాక్షి) :

ప్రపంచంలో అన్ని కంటే విలువైందని ప్రాణం అని, ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అందరూ తప్పకుండా రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటించాలిన రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణం బైపాస్‌ రోడ్డులో గల లారీ ఓనర్స్‌ అసోయేషన్‌ భవనంలో లారీ యాజమానుల ట్రాఫిక్‌ రూల్స్‌పై మంచిర్యాల ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూదేశంలో ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలన్ని అతివేగం, ఓవర్‌లోడ్‌, లైసెన్సు లేని వారు వాహనాలు నడపడం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, సెలఫోన్‌ మాట్లాడుతూ నడపడం వల్ల జరుగుతున్నాయని అన్నారు. మధ్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల రామగుండం కమీషనరేట్‌ పరిధిలో 2016లో 322, 2017లో 274, 2018లో ఇప్పటి వరకు 220 మంది మరణించారని, రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో రోడ్డు భద్రత, మనభద్రత, ప్రజల భద్రత అనే మూడు అంశాలను అలాగే మన కోసం ఇంటి వద్ద కుటుంబసభ్యులు ఎదురు చూస్తుంటారని మనస్సులో ఉంచుకోవానలని అన్నారు. అందుచేత అందరూ తప్పకుండా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సిఐ రమేష్‌బాబు, ఎఎస్సై భవానీ సేన్‌, లారీ యాజమనులు పాల్గొన్నారు.