మాట ఇచ్చని మడమ తిప్పని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం

 

 

 

 

జర్నలిస్టు కల సహకారానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి
జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
అందోల్ జోగిపేట// జనం సాక్షి// ఫిబ్రవరి::
ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కలల సహకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నేటికీ జర్నలిస్టుల కల నెరవేరిందని మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం తన స్వగ్రామమైన వట్పల్లి మండలంలోని పోతుల బొగుడలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలను అందజేసిన సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కల నేటికి నెరవేరిందని. అనునిత్యం సమస్యలతో పోరాడుతున్న జర్నలిస్టులకు గత ప్రభుత్వాలు జర్నలిస్టు సంక్షేమాన్ని మర్చిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని జర్నలిస్టు సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వారు పేర్కొన్నారు. 33 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఈ పట్టాలను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టులందరికీ పక్క గృహాలు నిర్మింపజేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సైతం జర్నలిస్టులదే ప్రత్యేక పాత్ర ఉందన్నారు. తను సీతమ్మ ఒక జర్నలిస్టుగా అనేక సమస్యలను ఎదుర్కొన్నానని ఆ సమస్యలు తనకు తెలుసు అని వారు జర్నలిస్టుల తరుపున వారి అనుభవాన్ని గుర్తు చేశారు. తను ఎల్లవేళలా జర్నలిస్టులందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జర్నలిస్టులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో
P మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య ఎంపిపి జోగు బాలయ్య మాజీ ఎంపీపీ రామ గౌడ్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు నారాయణ వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ జర్నలిస్టులు యూనియన్ అధ్యక్షుడు పవన్ కుమార్ ప్రదీప్ గౌడ్ రాంబాబు సంతోష్ రాజేష్ వర్మ భగత్ కాశీనాథ్ శ్రీనివాస్ నర్సింలు కుమార్ తదితరులు పాల్గొన్నారు.