మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలి: ఉపరాష్ట్రపతి

నెల్లూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాతృ భాష పరిరక్షణకు ఏం చేస్తారో ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. అందుకోసం ప్రజలు ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగో రోజు పర్యటిస్తున్న ఆయన వెంకటాచలంలో శనివారం విూడియాతో మాట్లాడారు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరూ రాజకీయాల్లోకి రాబోరని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. స్వర్ణభారత్‌ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. ఇక నుంచి ఐదు అంశాలతో ప్రజల్లోకి వెళ్తానని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పర్యటించి యువకుల్లో స్ఫూర్తి నింపుతానని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు పరిశీలిస్తానని చెప్పారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుల వద్దకు వెళ్తానని, భారత దేశ సంస్కృతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని వెల్లడించారు.