మాదిగలకు అన్యాయం చేస్తున్న సర్కార్‌

ఎంఎస్‌ఎఫ్‌ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కనక ప్రమోద్‌
నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో మాదిగలకు అన్యాయం చేస్తున్నదని, పాలనా విధానం మార్చుకోవాలని మాదిగ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కనక ప్రమోద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్లాడి, ప్రజాస్వామిక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, మొదటి వరసలో ఉండి పోరాటాలు చేసింది మాదిగలు, జైల్‌కి వెళ్లింది మాదిగలు, గజ్జె కట్టి ధూంధాం చేసింది మాదిగలు, ప్రాణత్యాగాలకు వెనుకడానిది మాదిగలని, అటువంటి మాదిగలకు ఉద్దేశ పూర్వకంగా అన్యాయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. విద్యాపరంగా పదవుల నియామకాల్లో కనీసం ఒక్కస్థానం కూడా ఇవ్వకుండా మాదిగ సమాజాన్ని అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌పిఎస్‌సి చైర్మన్‌ సభ్యుల నియామకాల్లో, వైస్‌ఛాన్సలర్ల నియామకాల్లో, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సెట్స్‌ కన్వీనర్ల నియామకాల్లో, ఉన్నత విద్య మండలి చైర్మైన్‌ నియామకాలతో పాటు విద్యరంగానికి సంబంధించిన ఏ ఒక్క నియామకంలో కూడా మాదిగలకు అవకాశం కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిరచారు. జెఎన్‌టీయూ రిజిస్ట్రార్‌గా మాదిగ ఉపకులానికి చెందిన ఒక అవకాశం వస్తే ఆగమేఘాల విూద ఉత్తర్వులతో రద్దు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ యూనివర్సిటీకి కూడా రిజిస్ట్రార్‌ ఇవ్వాల్సింది ఉండగా కూడా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా ఒక్క మాదిగకు కూడా చోటు కల్పించకపోవడం మాదిగ సమాజాన్ని గమనిస్తుందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మాదిగలే తెరాస ప్రభుత్వాన్ని భూస్థాపితం చెయ్యడం ఖాయమని హెచ్చరించారు.