మార్కెట్‌లోకి తడిసిని ఉల్లిగడ్డలు 

అయినా తగ్గని ధరలు
దసరాతో పెరిగిన కొనుగోళ్లు
హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): దసరా తోడు కావడంతో ఉల్లి ధరలు ఘాటు తగ్గడంలేదు. అయితే ధరలకు తోడు నాణ్యతలేని ఉల్లి మార్కెట్‌ను ముంచెత్తుతోంది. వర్షాల కారణంగా తడిసిన ఉల్లి వస్తోందని కొనుగోలుదారులు వాపోతున్నారు. తడిసిపోయినగడ్డ అయినా ధరలుమాత్రం తగ్గడం లేదు గతకొన్నిరోజులుగా రెండు తెలుగు రాష్టాల్రతోపాటు, మహారాష్ట్ర, కర్నాటక రాష్టాల్ల్రో భారీగా వర్షాలుకురుస్తున్నాయి దీంతో చాలా రాష్టాల్ల్రోఉల్లిపంట తీవ్రంగా నష్టపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. కోతకొచ్చిన పంట కూడా వర్షాల కారణంగానే తడిసిముద్దయిపోతోంది పెరిగిన ధరల నేపధ్యంలో వ్యాపారులు తడిసిన ఉల్లిగడ్డ అయునా సరే అధిక ధరలకే విక్రయిస్తున్నారు. రెండు వారాల క్రితం ¬ల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లిధరలు క్వింటాల్‌కు 5500 నుంచి 6000 పాయల వరకు పలికాయి. ఇక రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డ 60 నుంచి 70రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం భారీగా ఉల్లివస్తున్న నేపధ్యంలో ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం నగరంలోని ప్రదాన ¬ల్‌సేల్‌ మార్కెట్‌లయిన మలక్‌పేట, బేగంబజార్‌, ఉస్మాన్‌గంజ్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌లో క్వింటాల్‌ ఉల్లిధర 3200 నుంచి 4000 రూపాయలు పలుకుతోంది. మార్కెట్‌కు దిగుమతి అవుతున్న ఉల్లిగడ్డలో 90శాతం పూర్తిగా తడిసిపోయినదే ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. అయితే సరుకు తడిసిపోయిందన్న కారణంతో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరలకే వాటిని కొనుగోలుచేస్తున్నారు. తీరా రిటైల్‌ వ్యాపారులకు అమ్మే సమయంలో కవిూషన్‌ఏజెంట్టు ఆ ధరలను రెట్టింపుచేస్తున్నారు. తీరా వినియోగ దారుడికి చేసే సరికి మరింత పెరిగిపోతోంది తడిసిపోయిన ఉల్లిగడ్డ అయినా సరే రిటైల్‌ మార్కెట్‌లో కిలో 50 నుంచి 60 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు రోజుకు 120 నుంచి 130 లారీలు వస్తున్నాయి. అయినా ధరలు మా త్రం తగ్గడం లేదు. ఇకపోతే బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉల్లిధరలు కిలోకు 300 రూపాయలుపలుకుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. దీంతో చాలా మంది ఉల్లిగడ్డను దొంగచాటుగా రాష్ట్రం దాటించేస్తున్నారు. ముఖ్యంగా కోల్‌కతా నుంచి సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తున్నారు ఉల్లిఎగుమతులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.