మిర్చి రైతులను ఆదుకోవాలి 

ఖమ్మం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మిర్చిరైతులకు ఈ యేడు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదని రైతు సంఘం నేతలు అన్నారు. గిట్టుబాటు ధరలు చెల్లించేలా చూడాలని, మిర్చిని కొనుగోలు చేసి ఆదుకోవా
లన్నారు. అలాగే ఇటీవలి వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టులలో నష్టపోయిన భూయజమానులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా నాయకులు కోరారు. రైతులను ఆదుకునేందుకు మెరుగైన పరిహారం చెల్లించేందుకు కృషి చేయాలన్నారు.
కల్తీకారం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు అవసరమని రైతు సంఘం నేతలు అన్నారు. గతేడాది దొరికిన నకిలీ ముఠాను కఠినంగా శిక్షిస్తేనే ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఉంటుందన్నారు.  తెలుగు రాష్ట్రాలను  ఓ కుదుపు కుదిపిన కల్తీ కారం ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.పౌరసరఫరాల శాఖ, వైద్య ఆరోగ్యం తదితర శాఖలతో ముడిపడి ఉన్న ఈ అంశం విషయంపై శ్రద్ధ అవసరమన్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్ష తీసకుంటే తప్ప ఇలాంటి ఘటనలు ఉత్పన్నం కావన్నారు.