మిషన్‌ కాకతీయతో మారుతున్న ముఖచిత్రం

పెరుగుతున్న ఆయకట్టు..పంటల దిగుబడి

భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం పనిచేస్తున్నారని జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. అందుకే అనేక పార్టీల నుంచి వరుసగా గులాబీగూటికి వచ్చి చేరుతున్నారని అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారన్నారు. 24 గంటల రైతులకు విద్యుత్‌ సరఫరాతో పాటు రెండు పంటలకు రూ.పది వేలు పెట్టుబడిగా ఇచ్చేందుకు రంగం సిద్ధమైందన్నారు. రైతులు పంట మార్పిడి పద్ధతులను పాటించి అధిక ఉత్పత్తులను సాధించాలన్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్తగూడెం మున్సిపాలిటీలోని ప్రగతి మైదాన్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను నిర్మించి ప్రత్యేక శిక్షణలు ఇవ్వనున్నామన్నారు. పొదుపు చర్యల ద్వారా ప్రతి కుటుంబం ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు తమకు తామే పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. విద్యారంగంపైనా దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ పేదల ముంగిట్లోకి విద్యను తీసుకుని వస్తున్నామని అన్నారు. పిల్లల చదువులపై, వారి నడవడికలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివించి ప్రయోజకులను చేయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ నేటి యువత తల్లిదండ్రుల కలలను నిజం చేసే దిశగా ఆలోచించాలన్నారు. కుటుంబాలు బాగుపడితేనే ప్రభుత్వ లక్ష్యాలకు, పథకాలకు సార్ధకత ఉంటుందన్నారు.