మిషన్‌ భగీరథను వేగం పెంచాలి

-జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి

నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): మిషన్‌భగీరథ పనులను వేగవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారుజ. తన చాంబర్‌లో మిషన్‌ భగీ రథ పనులపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అదికారులతో సవిూక్షనిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 31 వరకు ప్రధాన పైప్‌లైన్‌ పూర్తి చేసేందుకు నిర్దేశించినందున జిల్లాలో అంతకంటే ముందే పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్‌ను మోటివేట్‌ చేప్తూ పనులు వేగవంతం చేసే విదంగా అధికారులు కృషి చేయాలన్నా రు. జిల్లాలోని ఆర్మూర్‌ నియోజకవర్గంలో 274 కిలోవిూటర్లకు 240 విూటర్లు ప్రదాన కాల్వ పూర్తయినందున మిగతా 64 కిలోవిూటర్లు సత్వర మే పూర్తి చేయాలని ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలో 363 కిలోవిూటర్లకు 312 కిలోవిూటర్లు పూర్తయినందున మిగతా 51 కిలో విూటర్లు నవంబర్‌లో పూర్తిచేయాలని అధికారులను ఎజెన్సీలను ఆదేశించారు నవంబర్‌ మాసాంతానికి ప్రతిగ్రామానికి నీరు ఇచ్చేలా చర్య లు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ దికారులు పాల్గొన్నారు.