ముఖ్య నేతలకు చోటు కల్పించని కాంగ్రెస్‌

పొన్నాల, మర్రి, విజయశాంతిలపై సస్పెన్స్‌

పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో పి/-పుడు ప్రధాన అభ్యర్థుల టిక్కెట్లనే పక్కన పె/-టారు. వీరికి టిక్కెట్లపై ఎలాంటి క్లారిటీ లేదు. పిసిసి మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి , మాజీ సిఎం తనయుడు మర్రి శశిధర్‌ రెడ్డి, స్టార్‌ కాంపెయినర్‌ విజయశాంతిలు ఇందులో ప్రధానంగా ఉన్నారు. వీరికి టిక్కట్లు ఇచ్చేది లేనిది తెలయడం లేదు. జనగామలో పొన్నాలను పక్కన పెట్టడంతో ఇక కోదండరామ కూడా పోటీకి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోదండరామ్‌ ఇక్కడ బరిలోకి దిగితే ఉమ్మడి జిల్లాలో దాని ప్రభావం ఉంటుంది. ఇకపోతే విజయశాంతిని ఎక్కడినుంచి బరిలోకి దింపుతారన్నది చెప్పడం లేదు. అలాగే సనత్‌నగర్‌లో పెద్దగా పోటీ లేకున్నా మర్రి శశిధర్‌ రెడ్డి పేరును కూడా పక్కన పెట్టారు. నల్లగొండ జిల్లాలో మాత్రం చిరుమతర్‌ఇ లింగయ్యకు టిక్కెట్‌ ఇచ్చారు. ఇదంతా కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఒత్తిడి అని తెలుస్తోంది. తమ ప్రధాన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు టికెట్‌ ఇవ్వకపోతే తాము కూడా పోటీ చేసేది లేదని స్పష్టం చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. ఢిల్లీలోనే మకాం వేసి టికెట్లు సాధించుకున్నారు. కాంగ్రెస్‌ జాబితాలో ముగ్గురికీ చోటు దక్కింది. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి; మునుగోడు నుంచి రాజగోపాల్‌ రెడ్డి, నకిరేకల్‌ నుంచి చిరుమర్తి లింగయ్యకు టికెట్లు ఇచ్చారు. నకిరేకల్‌ను తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయిస్తారని, అక్కడి నుంచి చెరుకు సుధాకర్‌ భార్య పోటీ చేస్తారని చివరి వరకూ ప్రచారం జరిగినా ఎట్టకేలకు కోమటిరెడ్డి బ్రదర్సే మాట నెగ్గించుకున్నారు. నకిరేకల్‌ నుంచి లింగయ్య, మునుగోడు నుంచి రాజగోపాల్‌రెడ్డి, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్‌ బరిలో ఉంటారని ఉద్ఘాటించారు.

రెండు మూడ్రోజుల్లో మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. అయితే ఇంకా కొందరు నేతల పేర్లు పక్కన పెటటడంలో గల ఆంతర్యం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.