ముగిసిన పాతగుట్ట బ్ర¬్మత్సవాలు 


యాదాద్రి,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): యాదాద్రికి  అనుబంధంగా ఉన్న పాతగుట్టలో వారం రోజులుగా కొనసాగుతున్న బ్ర¬్మత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజైన గురువారం ఆగమశాస్త్రానుసారం వేదపండితులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి,కలశపూజ చేశారు. అనంతరం జీవనదుల నుంచి తెచ్చిన జలాలతో శ్రీవారికి అభిషేకం చేశారు. వేదమంత్ర పఠనములతో అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. రాత్రి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు భక్తుల భారీగా హాజరై తమ మొక్కులు తీర్చుకున్నారు. 10 కలశములలో పంచామృతాలు, పవివూతతీర్థ జలాలు, సుగంధ ఫలరసములు, నారికేళ జలాలను అభిమంవూతించి పవిత్ర ద్రవ్యములతో తీర్థరాజములతో కల్యాణోత్సవ మూర్తులను, మూలవరులను అభిషేకించడమే అష్టోత్తర శతఘటాభిషేకం ప్రత్యేకత అని ఉప ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు వివరించారు. 10 కలశముల ద్వారా అభిషేకం చేసిన ముక్తి లభించి పరమాత్మ అనుక్షిగహం సులభంగా పొందవచ్చునని ప్రధానార్చకుడు తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. పంచభూతాలలోని పృథ్వీజలాలు, వాయువు, తేజస్సు తత్వాలు ప్రకృతి నిండా ఆవరించిన ఫలభరిత మధుర రసాల సృష్టికి కారణభూతమైన  ద్వాదశాధిత్యులు తదితర 10 కలశాలతో పూజ జరిపారు. కలశతీర్థం, పుణ్యజలానికి వేదమంవూతాలతో పూజలుచ విశ్వేక్సేనపూజ నిర్వహించారు. ప్రధాన కలశంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. కలశ తీర్థం పుణ్యజలాన్ని కలిపి శ్రీవారికి అభిషేకం జరిపారు. పంచామృతాలు, పంచసూక్త పఠనాలతో నిర్వహించారు. ఉత్సవ కైంకర్యాన్ని యాదాద్రి ఆలయ ఉప ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు జరిపారు. ఉత్సవ నిర్వాహకులకు, భక్తులకు మహదాశీర్వచనం జరిపారు. ఆలయ ఈవో ఎన్‌.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఏఈవోలు దోర్బల భాస్కర్‌, మేడి శివకుమార్‌, వెంక లక్ష్మణ్‌ పాల్గొన్నారు.