ముగిసిన రాజశ్యామల యాగం

అక్కడి నుంచే నేరుగా పాలేరుకు సిఎం కెసిఆర్‌

సిద్దిపేట,నవంబర్‌19(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల, మహారుద్ర సహిత యాగాలుపూర్ణాహితితో సోమవారం ముగిసాయి. అనంతరం ఆయన అక్కడి నుంచే ఖమ్మం జి/-లలా పాలేరు సభకు చేరుకున్నారు. యాగం పూర్తి చేసి వచ్చానన్నారు. ప్రజల సంక్షేమం కోసమే యాగం చేపట్టామని అన్నారు. కేసీఆర్‌ దంపతులతో పాటు కోడలు శైలిమ, మనుమడు హిమాన్ష్‌, మనవరాలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు యాగంలో పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శృంగేరీ పీఠం ఆస్థాన పండితులు ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలు యాగాలు జరిపించారు. రాజశ్యామల ¬మంలో భాగంగా సూర్య నమస్కారాలు, మహా లింగార్చన, అన్ని గ్రహాలకు ¬మాలు, చండీయాగం తదితర పూజాధికాలు జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు ఇందులో పాల్గొన్నారు. సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతితో ఈ యాగం పరిపూర్ణమయ్యింది. ఏకరాత్రి దీక్షలుంటాయని వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే యాగం లక్ష్యమని ముఖ్యమంత్రి ఖమ్మం సభలో పేర్కొన్నారు. పరమేశ్వరుని దయతో తెలంగాణ అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.