మున్సిపల్ శానిటేషన్ సూపర్వైజర్ భార్య మృతి… 

పార్థివదేహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.,.                                                జనంసాక్షి,కొత్తకోట,జూన్20,
కొత్తకోట మున్సిపల్ కేంద్రానికి చెందిన మున్సిపల్ శానిటేషన్ సూపర్వైజర్ వెంకటయ్య భార్య కొమ్ము చంద్రకళ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళి అర్పించారు. అనంతరం శానిటైజర్ సూపర్వైజర్ వెంకటయ్యను కలిసి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు.ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వెంట జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్, మార్కెట్ చైర్మన్ సా క బాల నారాయణ,సీడీసి చైర్మన్ బీ సం చెన్న కేశవ రెడ్డి,ఉమ్మడి జిల్లా లో తెరాస అధికార ప్రతినిధి గాడిలా ప్రశాంత్,14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పద్మ అయ్యన్న,కో ఆప్షన్ సభ్యులు జేఎం మిషేక్, వసీం ఖాన్, మాజీ వార్డు సభ్యులు సుభాష్,తెరాస మైనార్టీ మండల అధ్యక్షులు లాలూ, పట్టణ ప్రధాన కార్యదర్శి వికాస్,మహేష్,జేమ్స్,చింటూ తదితరులు పాల్గొన్నారు.