మూడుకు మూడు టిఆర్‌ఎస్‌ గెలుస్తుంది

రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్న తెలంగాణ

టిఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ది ముందుకు: ఎమ్మెల్సీ బోడకుంటి

జనగామ,నవంబర్‌14(జ‌నంసాక్షి): జిల్లాలో మూడుకు మూడు స్థానాలు గెలుస్తామని టిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. టిడిపి, కాంగ్రెస్‌ జతకట్టి మహాకూటమి ఏర్పడ్డా తమకు ఒరిగేదేవిూ లేదన్నారు. తమను అడ్డుకునే వారు లేరన్నారు. అబివృద్ది మా నినాదం, కెసిర్‌ మా నాయకుడు అన్నదే ప్రచారమని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అబ్యర్థులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు,ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్‌ రాజయ్యలు అన్నారు. వీరు ప్రచారంలో దూసుకుని పోతునన్నారు. నిత్యం గ్రామాలు చుట్టి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అమలు చేశారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24గంటలపాటు విద్యుత్‌ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. పక్క రాష్ట్రంలోని తమిళనాడులో రూ.22 చొప్పున విద్యుత్‌ను కొనుక్కుంటున్నారని అన్నారు. రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరాకు రెండు పంటకు గాను ఏడాదికి రూ. 8వేలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకాన్ని విమర్శించిన కాంగ్రెస్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయవద్దని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో మొదటి దఫాలో 46లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. గతంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం బారులుతీరేవారని, నేడు ఆ పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. నేరుగా ఎరువులు, విత్తనాలు అందించడంతోపాటు, పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని ఆయన తెలిపారు. రైతు సమన్వయ కమిటీ సభ్యులు రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ కోరారు. ఉమ్మడి సీమాంధ్ర పాలనలో పూర్తిగా వెనుకబడిపోయిన జనగామను జిల్లాగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన మేరకు అభివృద్ధి చేసి చూపించామన్నారు. మిషన్‌ భగీరథ పనులు అన్ని మండలాల్లో చురుగ్గా జరుగుతున్నాయన్నారు. డబుల్‌బెడ్‌రూం కింద కొన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.మాయా కూటమిలతో వచ్చే వారిని తరిమికొట్టాని ఆయన కోరారు.