మేనిఫెస్టోలో అందరికి భరోసా

కెసిఆర్‌ ప్రకటనతో పెరిగిన ధైర్యం
పద్మాదేవేందర్‌ రెడ్డి
మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 60ఏళ్లలో లేని అభివృద్ధి నాలుగున్నరేళ్లలోనే చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని, కేసీఆర్‌ పాలనలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మాజీ డిప్యూటి స్పీకర్‌, మెదక్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్తి పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కెసిఆర్‌ ప్రకటించిన మ్యానిఫెస్టో అన్‌ఇన వర్గాలను గుర్తించేదిగా ఉందన్నారు. రైతులకు అండగా నిలవడం,నిరుద్యోగులకు పెన్షన్‌ ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామ మని అన్నారు. కెసిఆర్‌ ఏదైనా చెబితే అమలు చేస్తారన్న భరోసా ప్రజల్లో ఉందన్నారు. గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వాలు చేయనన్ని నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని
అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుమారు 450 సంక్షేమ పథకాలతో పేదవారి కడుపు నింపుతుంటే, ప్రజలను మోసం చేయడానికే మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌, టీడీపీ లు ఒక్కటవుతున్నారని, వారికి తగిన గుణపాఠం ప్రజలే చేప్పుతారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసే ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి పోటే చేసే అవకాశం సీఎం కేసీఆర్‌ కల్పించినందన తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే రెట్టింపు ఉత్సహంతో మరింత అభివృద్ధిని చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఏ ప్రభుత్వం చేయని పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే నెంబర్‌ వన్‌ సీఎంగా నిలిచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గ్రామాల్లో ప్రజలు చూపిన ఆదరణ చూస్తుంటే మళ్లీ సీఎం కేసీఆర్‌ కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.