మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు.. 

పాల్‌ ఎలెన్‌ కన్నుమూత
అమెరికా, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ ఎలెన్‌ కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా ఎన్‌హెచ్‌ఎల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం పాల్‌ చనిపోయినట్లు ఆయన సోదరి ఓ ప్రకటన విడుదల చేశారు. పాల్‌ ఎలెన్‌ ఐటీ రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్‌ సహా టెక్‌ రంగానికి పాల్‌ అందించిన సేవలు ఎనలేనివి. సంస్థ సహ వ్యవస్థాపకుడిగా నిరంతర శ్రమతో ఎన్నో విజయాలు సాధించారు. మాకు మరెన్నో అనుభవాలు, అనుభూతులు మిగిల్చారు. నేను ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ఆయనలోని ఉత్సాహం మైక్రోసాఫ్ట్‌ కుటుంబంలో నూతన ఉత్తేజాన్ని నింపింది.. పాల్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఓ ప్రకటనలో తెలిపారు. బిల్‌గేట్స్‌, ఎలెన్‌పాల్‌ కలిసి మైక్రోసాఫ్ట్‌ సంస్థను 1975లో స్థాపించారు. మైక్రోసాఫ్ట్‌లో వాటా సహా.. 20.2 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోని ధనవంతుల్లో పాల్‌ 46వ స్థానంలో ఉన్నారు. 1986లో ఉల్కన్‌ ఇంక్‌ అనే సంస్థను స్థాపించారు.