మైనర్ బాలికపై అత్యాచారయత్నం

కూతురు వయసున్న  మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు కరీంనగర్ జిల్లాలో ఓ కీచకుడు. దుర్షేడ్ కు చెందిన అశోక్ అనే నలభైఏళ్ల వ్యక్తి. ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేయడానికి ట్రై చేశాడు. దీంతో అతన్ని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.