మొక్కలు నాటడం మన బాధ్యత

కామారెడ్డి,జూలై23(జ‌నంసాక్షి): మానవ మనుగడకు చెట్లు అవసరమని అప్పుడే వానలు సమృద్ధిగా కురుస్తాయని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కోసం కార్యక్రమాన్ని సిద్దం చేశామని ఆయన అన్నారు. ఉద్యమంగా హరితహారం కార్యక్రమం చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒ క్కరూ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని కలెక్టర్‌ అన్నారు. హరితహారంలో భాగంగా వివిధ రకాల మొక్కలను నాటడానికి ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపుల, మొక్కలను నాటిస్తున్నట్లు చెప్పారు. మొక్కలు పెద్దవిగా ఉండడం రకరాల పండ్ల మొక్కలతో పాటు వేప, మామిడి మొక్కలు పెద్దవిగా ఉండడంతో ఇలాంటి మొక్కలు నాటడంతో రెండు సంవత్సరాల్లోనే మొక్క చెట్టుగా మారుతుందని అన్నారు. మొక్కలు నాటగానే సరిపోదని, వాటిని కాపాడాలని కోరారు. హరితహారం కార్యక్రమంపై అధికారులు, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అధికారులతో కలిసి విత్తన బంతులను విసిరిస్తున్నారు. మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు అవరమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. భావితరాలకు ర్యావరణాన్నిఅందించేందుకు ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమం ప్రారంభించారని అన్నారు.