మొక్కల పెంపకంపై ప్రోత్సాహం

జనగామ,జూలై19(జ‌నం సాక్షి): వర్షాలు కురుస్తున్నందున అనుకూల వాతావరణం ఏర్పడిందని, అందువల్లపల్లెల్లో, రహదారుల వెంట ఉద్యమంలా మొక్కల పెంపకాన్ని జోరుగా చేపట్టాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆకుపచ్చ తెలంగాణెళి ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. ఖాళీ ప్రదేశాలు, స్థలాలలో విరివిగా మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణకు బాటలు వేయాలని కోరారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొక్కలు జీవకోటికి ఆధారమని, ప్రతిఒక్కరు మొక్కలు నాటి హరితతెలంగాణకు పాటుపడాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అధికారులను కలుపుకుని హరితహారంలో విస్తృతంగా మొక్కలు నాటుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నాలుగో విడత హరితహారం ఉద్యమంలా కొనసాగాలన్నారు. ఇప్పటి వరకు లక్షలాది మొక్కలను నాటడం జరిగింది. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హరితహారం ద్వారా భావితరాల భవిష్యత్‌ బాగుంటుందనన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నిరంతరంగా కొనసాగింది.