మొదలైన నాగోబా జాతర సందడి

గంగాజలాన్ని సేకరించేందుకు మెస్రం వంశీయులు

గిరిజన సంస్కృతికి ప్రత్యేక ఆదరణ

ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రాధాన్యత

ఆదిలాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): నాగోబా జాతరకు గడువు సవిూపిస్తున్న నేపథ్యంలో కార్యక్రామలు ఊపందుకున్నాయి. పవిత్ర జలం సేరకరించే పనులను మోస్రం వంశీకులు చేపట్టారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించనున్న నాగోబా జాతర కోసం ఏటా మాదిరిగానే ఈ ఏడాది సైతం గంగాజలాన్ని సేకరించేందుకు మో/-రం వంశీయులు వెళ్లారు. ముందుగా గోదారమ్మకు నైవేద్యం సమర్పించి జలాన్ని

సేకరించి తీసుకుని వస్తారు. . జన్నారం మండలం కలమడుగు గ్రామ సవిూపంలో ఉన్న గోదావరి పవిత్ర జలాన్ని మెస్రం వంశీయులు సేకరిస్తారు. వచ్చే నెల ప్రారంభమయ్యే నాగోబా జాతరలో దర్బార్‌ రోజున ఆదివాసీల సంప్రదాయ వంటలు చేయిస్తామని, జాతరలో ఆదివాసీల సంప్రదాయ ఆటలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఐటీడీఏ అధికారులు అన్నారు. అలాగే ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జాతరలో ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయలతో కూడిన ప్రత్యేక పోటీలు నిర్వహించాలన్నారు. గిరిజనుల సంస్కృతికి సంబంధించిన పూరాతన వస్తువులతో ప్రదర్శణ ఏర్పాటు చేయాలని, ఆదివాసీ గిరిజనులు ఆడే పూగిడి, మూద్ద, చమ్మతో పాటు వారి సంప్రదాయనికి చెందిన ఆటలు నిర్వహించాలన్నారు. జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆదివాసుల అన్ని ఆటలను నిర్వహిస్తున్నామన్నారు. జాతరకు వచ్చే వివిధ రాష్ట్రాల గిరిజనులు, ఇతర జిల్లాల గిరిజనులకు ఉమ్మడి జిల్లాలోని 9 గిరిజన తెగల సంప్రదాయ నృత్యాలను మినీ గిరి ఉత్సవ్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవత నాగోబా పూజ బావి వద్ద కోనేరు నిర్మాణం ఈనెల 23వ తేదీలోగా పూర్తి చేస్తామని పీఓ అన్నారు. నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. అభివృద్ధి పనులు, ఏర్పాట్లను ఈనెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి మహిళలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జాతరలో దుకాణదారులు ప్లాస్టిక్‌ను నిషేధించి పేపర్‌ బ్యాగులు వాడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో పేపర్‌ బ్యాగులు సరఫరా చేయాలన్నారు. తైబజార్‌తోపాటు జాతరలో వృథా అయ్యే తాగునీటితో చిత్తడి ఏర్పడ కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.