మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు 28 వరకు గడువు

జనగామ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మోడల్‌ పాఠశాలలో 2018-19 విద్యాసంవత్సరానికి ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ ప్రకటించారు. 6వ తరగతిలో 100సీట్లు, మిగతా 8నుంచి 10వరకు పాఠశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి ఇంగ్లిషు విూడియం విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. మోడల్‌ పాఠశాలలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల పక్రియ ప్రారంభమైంది. ఈ నెల 28వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 8నుంచి13 వరకు హాల్‌టికెట్‌లు డౌన్‌లౌడ్‌లు చేసుకోవాలి. ఏప్రిల్‌ 13న పరీక్ష నిర్వహిస్తారు. 6వ తరగతి విద్యార్థులకు 13న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. మే18న ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. మే 28నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్లను పరిశీలించి అడ్మిషన్లు తీసుకుంటారు. ఆదర్శ పాఠశాల ప్రవేశపరీక్ష విద్యార్థులకు 100మార్కులకు ఉంటుంది. విద్యార్థులు సీట్ల కో సం దరఖాస్తులు చేసుకునే ముందు తరగతి పా ఠ్యాంశాల సిలబస్‌పై పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్‌కు 25మార్కుల చొప్పున తెలుగు, గణితం, ఈ వీఎస్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లు మొత్తం 100ప్రశ్నలకు 100మార్కుల పరీక్ష నిర్వహిస్తారు. పాఠశాలలో ఉన్న సీట్ల ప్రకారం మెరిట్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయిస్తారు. ఆయా పాఠశాలల్లో ఆదర్శమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇదేకాక ఈ పా ఠశాలల్లో 6నుంచి10వ తరగతి, ఇంటర్మీడియట్‌ వరకు ఉన్న పాఠశాలల్లో అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో ప్రవేశాలకు విపరీతమైన పోటీ పెరిగింది. విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి ఇంగ్లిషు విూడియం బోధన అందుబాటులో ఉంది. 6 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్న భోజన వసతి ఉంటుంది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ ఇస్తారు. డిజిటల్‌ తరగతులు, సైన్స్‌ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ సదుపాయాలు ఉన్నాయి.