యాదాద్రి ఓ అద్భుత ఆవిష్కరణ


దేశంలో ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నం జరగలేదు
యాదాద్రి ఓ అద్భుత టెంపుల్‌ సిటీగా మారనుంది
రైతుకు భరోసా కల్పిస్తున్న సిఎం కెసిఆర్‌
కాళేశ్వరంతో మారిన వ్యవసాయ ముఖచిత్రం
గుత్తా సుఖేందర్‌ రెడ్డి వెల్లడి
నల్లగొండ,అక్టోబర్‌20( (జనం సాక్షి)): యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం దేశానికే తలమానికం కానుందని మండలి మాజీ ఛైర్మన్‌, టిఆర్‌ఎస్‌ నేత గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఆలయ నిర్మాణం చూశాక ఓ అద్భుతం ఆవిష్కృతం అయ్యిందని అన్నారు. ఇంతటి అద్భుత నిర్మాణం కెసిఆర్‌కు మాత్రమే సాధ్యమయ్యిందన్నారు. యాదాద్రి అద్భుతమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లడం ఖాయమన్నారు. తెలంగాణ తిరుపతిగా ఖ్యాతికెక్కడం కూడా అంతే నిజమని అన్నారు. ఇంతటి మహత్కార్యాన్ని నెత్తికెత్తుకోవడం అన్నద దైవ సంకల్పం మాత్రమే అన్నారు. తెలంగాణలో కెసిఆర్‌ ఏ పని చేపట్టినా అద్భుతమే అని అన్నారు. తెలంగాణ పథకాలే దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. రైతుబంధు పథకం దేశానికే
ఆదర్శంగా నిలవడమే గాకుండా ప్రధాని మోడీ కూడా దానిని అమలు చేస్తున్నారని అన్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఒక్కో పథకాన్ని తీసుకుని విశ్లేషిస్తే అర్థం అవుతుందని, విమర్శించాలకునే వారికి దేనినైనా విమర్శించ వచ్చాన్నారు. కాళేశ్వరంతో పాటు చెరువుల పూడికతీత తదితర కార్యక్రమాలతో పుష్కలంగా నీరు వచ్చి చేరిందన్నారు. దీంతో రైతులు ఎంతగా ఆనందంగా ఉన్నారో గ్రామాల్లోకి వెళితే తెలుస్తుందని అన్నారు. బుధవారం నాడాయన ఆర్‌ఎన్‌ఎ ప్రతినిధితో మాట్లాడుతూ రైతుబంధు అన్నది అన్నదాతను గట్టెక్కించే కార్యక్రమాల్లో ఒకటి మాత్రమేనని అన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని, ఆ పరంపరలో ఇది మరోటని అన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు పూర్తి కావస్తున్న తరుణంలో సిఎం కెసిఆర్‌ సంకల్పించిన కోటి ఎకరాల మాగాణం కల సాకారం కానుందన్నారు. ఇప్పటికే రైతులకు నిరంతర నీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. అందుకే తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగి పంటలు కూడా పెరిగాయన్నారు. నీరు, విద్యుత్‌, వ్యవసాయ పరికరాలు, పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లు జరిగి మద్దతు ధరలు లభిస్తే ఇక రైతు రాజు కాక మరేంటని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా అమలు కావడం ఇష్టం లేని వారు మాత్రమే విమర్శలు చేస్తున్నారని గుత్తా అన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంతటి అభివృద్ది చూడలేదన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమం అన్నది ఓ సఫల ప్రయత్నమని రుజువు కాబోతున్నదని, దేశానికి ఇది ఆదర్శం కానుందన్నారు. రైతులు పంటల సాగు కోసం ఇప్పటి నుంచి అప్పులు చేయాల్సిన పనిలేకుండా చేయాలన్న ఆలోచనలోంచి వచ్చిందే రైతుబంధు పథకమని అన్నారు. తెలంగాణలో కోటీ 42 వేల ఎకరాల వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. పంటలు సాగుచేసే రైతులకు ఎకరాకు రెండు పంటలకు గానూ రూ.10 వేలను అందజేస్తున్న పథకం ఎక్కడయినా ఉందా అని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత పెట్టుబడులతో వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే అవకాశం లభించిందన్నారు. దేశంలో రైతుల బాధలను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, రైతులకు అవసరమైన పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల బోర్‌ వెల్స్‌ ద్వారా 50 లక్షల ఎకరాలను సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణలో త్వరలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని, అప్పుడు రెండు పంటలకు పుష్కలంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. రైతులకు వచ్చే నెల నుంచి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని, ఇందుకు అవసరమైన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమగ్ర సర్వేను విజయవంతంగా పూర్తి చేసి పక్కాగా పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. భూ సమగ్ర సర్వేను అధి కారులు సమర్థవంతంగా నిర్వహించారన్నారు. రైతుల పూర్తి వివరాలతో పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు రైతుల గురించి పట్టించు కోలేదన్నారు.గ్రామాల్లో పంటల సాగులో రైతు సమన్వయ సమితుల సభ్యులు కీలకపాత్ర పోషించాలని కోరారు. సభ్యులు గ్రామాల్లో అధికారులు, రైతులతో సమావేశాలు నిర్వహించి ఏ పంటలు సాగుచేస్తే మంచి ధరలు లభిస్తాయనే విషయాలను చర్చించాలని సూచించారు. గ్రామాల్లో రైతు సమన్వయ సమితుల ద్వారా పంటలను కొనుగోలు చేస్తామని తెలిపారు. వ్యవసాయ క్లస్టర్లో భూసార పరీక్షలు నిర్వహిస్తారని, రైతులు
వీటి ఆధారంగా పంటలను వేయాలని సూచించారు.