యాదాద్రి పనుల్లో పురోగతి

నారసింహ చరిత్ర తెలిపేలా శిల్పాలు

యాదాద్రి భువనగిరి,మే26(జ‌నంసాక్షి): యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెలంగాణలోనే ముఖ్యమైనది. యాదాద్రికి ఇటీవల భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు దినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు లక్ష మంది వరకు వస్తున్నారు. కొత్త ఆలయం నిర్మాణం తర్వాత భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు బాలాలయంలో ఎలాంటి లోటు లేకుండా ఉత్సవాలు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కొనసాగుతున్న విస్తరణ పనులను పరిశీలించి పనులపై ప్రతినిధులకు సూచనలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనేక ప్రత్యేకతలతో దేశంలోనే అత్యద్భుత దేవాలయంగా యాదాద్రిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. నిర్మాణ పనుల్లో ప్రతీ అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రోజూ లక్షమందికి పైగా భక్తులొచ్చినా.. దర్శనం, వసతికి అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నరసింహస్వామి 32 అవతారాలనూ యాదాద్రిలో ప్రతిష్ఠించాలని అన్నారు. స్వామి వారి కీర్తనలను ప్రాచుర్యంలోకి తేవాలని చెప్పారు. యాదాద్రికి నలువైపులా రహదారులను నిర్మించాలి. నాలుగు వరసల రింగ్‌ రోడ్లు, ప్రదక్షిణ మార్గాలను ఏర్పాటుచేయాలి. ప్రధాన గుట్టకు ముందుండే గుట్టపై అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలను నిర్మించాలి. ఈశాన్య భాగంలో 13

ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై చేపట్టిన రాష్ట్రపతి నివాస గదుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికే సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన భూమిని, నిధులను కేటాయించారు. నిర్మాణాలను సజావుగా పూర్తి చేయాలని, క్షేత్రంలోని వివిధ ప్రదేశాలకు దైవనామానాలను పెట్టడం ద్వారా భక్తులు విధిగా దైవనామస్మరణ చేస్తారు. ఆలయ ప్రాంగణమంతా దైవ స్తోత్రాలు, కీర్తనలు వినిపించేలా

ఏర్పాట్లు చేయాలి. యాదాద్రి నర్సింహస్వామి ప్రత్యేక కీర్తనలుండేవి. ప్రత్యేక వాగ్గేయకారులుండేవారు. ఆ కీర్తనలను, వాగ్గేయకారులను గుర్తించి వెలుగులోకి తేవాలి. గుట్ట కింద నుంచి పైకి భక్తులను తీసుకు పోవడానికి ఆలయం ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలి. సువాసనలు వెదజల్లే చెట్లు పెంచాలనే అనేక అంశానలు సిఎం కెసిఆర్‌ ఆదేఆల మేరకుపనులు కొనసాగుతున్నాయి. యాదాద్రికి సవిూపంలో ఉన్న 85 ఎకరాల అటవీ భూమిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు.