యాధాద్రి ధర్మల్‌ ప్లాంట్‌పై పోరాటం చేస్తా

– కవిూషన్‌ల కోసమే జగదీశ్వర్‌రెడ్డి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు
– కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్లాంట్‌ను ఆపేస్తాం
– కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : దామరచర్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను అపాల్సిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. నల్గొండలో ఓ వైపు ఫ్లోరైడ్‌… మరో వైపు కోలే పవర్‌ ప్రాజెక్ట్‌ తీసుకొస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కవిూషన్‌లు ప్రభుత్వానికి వచ్చాయో…? లేక ఆయనకు వచ్చాయో? కానీ, కొందరు మద్దతు ఇస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. పవర్‌ ప్లాంట్స్‌ వద్దని కేంద్రం కూడా చెప్పిందని,  నల్గొండలో ప్లాంట్‌ ఇప్పటికైనా ఆపాలని కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు. లేకపోతే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాంట్‌ను ఆపడం ఖాయమన్నారు. ఈ విషయంలో మా పార్టీని ఒప్పిస్తానని కోమటరెడ్డి తెలిపారు. పార్టీ ఒప్పుకున్నా… లేకున్నా.. నేను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. కేవలం కవిూషన్‌ల కోసమే జగదీశ్వర్‌రెడ్డి పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏమైనా ఏంలేదు కానీ.. నాకు కవిూషన్‌ వస్తే చాలన్నట్లు కోమటిరెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ధర్మల్‌ ప్లాంట్‌ వల్ల గాలి, నీరు కలుషితం అవుతుందని, నల్గొండ ప్రజలకు ప్రణాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. ధర్మల్‌ ప్లాంట్‌ కచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.