యుద్ధానికి సిద్ధంకండి

– అభిమానులకు రజనీకాంత్‌ పిలుపు
చెన్నై,మే 19(జనంసాక్షి):తమిళ రాజకీయాల్లో సంచలనం కలగబోతుందా? రజనీ రాజకయీఆల్లోకి రాబోతున్నాడా? అంటే అవునని ఆయనే పరోక్షంగా అంగీకరించారు. రాజకీయాల్లోకి రావాలన్న రజనీకాంత్‌ ఆంతరంగం బయటపడింది. ఇందుకు ఆయన స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. యుద్దానికి సిద్దంగా ఉండండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. నేరుగా రాజకీయాల్లోకి వస్తారా లేక ఎవరికైనా మద్దతు ఇస్తారా అన్నది ఇప్పుడే తెలియదు. రాజకీయాల్లో ఎంతో మంది సీనియర్‌ నాయకులు ఉన్నారు, జాతీయ పార్టీలు ఉన్నాయి.. కానీ రాజకీయ పరిస్థితి మాత్రం సక్రమంగా లేదు. ప్రజాస్వామ్యం క్షీణించింది. ఈ వ్యవస్థ మారాలి. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు రావాలి, అప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుందని రజనీ అన్నారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొద్దిరోజులుగా తన అభిమానులతో ప్రాంతాల వారీగా సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన శుక్రవారం తమ అభిమాన నటుడిని కలుసు కునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కొడంబాక్కంలో గల అభిమానులతో ఆయన నేడు సమావేశమయ్యారు. నేటి భేటీ సందర్భంగా రజనీ తన స్థానికత అంశాన్ని లేవనెత్తారు. కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నాను. తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నానన్నారు. తాను పుట్టింది మహారాష్ట్రలో అయినా అభిమానులు తనని తమిళుణ్ని చేశారన్నారు. తానిప్పుడు పక్కా తమిళుణ్ని అని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందన్న రజనీకాంత్‌ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమిళనాడులో మంచి నాయకులున్నా వ్యవస్థలో మార్పురాలేదని వెల్లడించారు. తనకు కొన్ని బాధ్యతలు, పనులు ఉన్నాయని అదేవిధంగా వి?కు(అభిమానులకు) కూడా ఉన్నాయన్నారు. మొదట వాటిని పూర్తిచేద్దామన్నారు. యుద్ధం(ఎన్నికలు) ఆరంభమయ్యేనాటికి మనమంతా సిద్ధంగా ఉందామని పేర్కొన్నారు.దాదాపు ఎనిమిదేళ్ల విరామం అనంతరం రజనీకాంత్‌ అభిమానులను కలిశారు. సోమవారం నుంచి నేటి వరకు ఆయన అభిమానులను కలిసి ఫొటోలు దిగేందుకు అవకాశమిచ్చారు. గత ఐదురోజులుగా రజనీకాంత్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో సమావేశమైతున్న విషయం తెలిసిందే. దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా?.. రారా?.. వస్తే ఎప్పుడు? ఇటువంటి ప్రశ్నలు ఆయన అభిమానులనే కాదు తమిళ ప్రజలను సైతం వెన్నాడుతున్నాయి. జనాకర్షణ, ప్రజాధారణ కలిగిన జయలలిత మృతి, డీఎంకే సుప్రీమో కరుణానిధి అనారోగ్య కారణంతో ఇంటికే పరిమితం కావడంతో తమిళనాడులో క్రీయాశీల రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే దేవుడి ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా అని రజనీ చెప్పడంతో మరొకమారు రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై చర్చకు తెరలేచింది. ఇందులో భాగంగానే అన్నట్లుగా ఆయన గత ఐదు రోజులుగా అభిమానులతో సమావేశమవుతున్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందన్న రజనీకాంత్‌ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమిళనాడులో మంచి నాయకులున్నా వ్యవస్థలో మార్పురాలేదని వెల్లడించారు. మనమందరం కలిసి మార్పు కోసం చూద్దామన్నారు. అయితే రజనీకాంత్‌ సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నాడు. రాజకీయాల్లోకి వస్తాడా రాడా అన్నది నేరుగా చెప్పకుండా.. రోజుకో ట్విస్ట్‌తో ఉత్కంఠ పెంచుతున్నాడు. తాజాగా ఐదో రోజు అభిమానులతో సమావేశం సందర్భంగా రజనీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన దగ్గర మంచి నాయకులు ఉన్నా.. వ్యవస్థ సరిగా లేక వాళ్లు ఏవి? చేయలేకపోతున్నారని అన్నాడు. ఇలా చెబుతూ.. అతను డీఎంకే నేత స్టాలిన్‌ పేరు చెప్పడం ఆసక్తి రేపుతున్నది. తమిళ రాజకీయాల్లోనూ స్టాలిన్‌, అన్బుమని రాందాస్‌, తిరుమవలవన్‌లాంటి మంచి నేతలు ఉన్నా.. వ్యవస్థ వారిని సరిగా పనిచేయ నివ్వడం లేదు. స్టాలిన్‌ సమర్థుడే అయినా కూడా ఏవిూ చేయలేకపోతున్నారంటే దానికి కారణం వ్యవస్థే అని రజనీ అన్నాడు. వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ప్రజల మైండ్‌సెట్‌ మారాలని రజనీ స్పష్టంచేశాడు. ఇక బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి కూడా పరోక్షంగా చురకలంటించాడు రజనీకాంత్‌. తమిళ పాలిటిక్స్‌లో అతిపెద్ద వైఫల్యం రజనీ అని స్వామి చేసిన వ్యాఖ్యలపై రజనీ స్పందించాడు. నాకు కొన్ని బాధ్యతలు, పనులు ఉన్నాయి. విూకూ పనులు ఉంటాయి. అవి చేస్తూనే అంతిమ యుద్ధం వచ్చినపుడు ఏం జరుగుతుందో చూద్దామంటూ రజనీ అనడం చూస్తుంటే అతను రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. అటు స్టాలిన్‌ను పొగడటం చూస్తుంటే.. అతను డీఎంకే వైపు మొగ్గుతాడా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించాడు. అన్నా డీఎంకే అంటే అతనికి అసలు పడదు. ఇక తమిళనాడులో మిగిలిన పెద్ద పార్టీ డీఎంకేయే. ఊహించినట్లే రజనీ డీఎంకే వైపు చూస్తే మాత్రం తమిళ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయం.