యువతకు సాన పెడుతున్న జాగృతి 

సొంతకాళ్లపై నిలబడేలా శిక్షణ
శిక్షణార్థులల పెఇగిన భరోసా
హైదరాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): నిరుద్యోగులుగా ఉన్న వారికి, మధ్యలో చదువుమాని ఇబ్బందులు పడుతున్న యువతీ యువకులను ప్రొత్సహించి వారికి చేయూతనందించాలనే లక్ష్యంతో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎంపీ కవిత సారథ్యంలో జాగృతి ప్రతినిధులు నిర్వహిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రాలకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే అనేక చోటల్‌ అనేకులు శిఓణ కూడా
పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల జాగృతి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసి యువతను ప్రొత్సహిస్తున్నారు.  తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వాల సహకారంతో తెలంగాణ జాగృతి నిరుద్యోగ యువత కోసం పని చేస్తుంది. ఇందులో భాగంగానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌ ఇలా మూడు విభాగాల్లో శిక్షణ అందిస్తున్నాము. ఇప్పటి వరకు శిక్షణ తీసుకున్న వారిలో స్వతహాగా బిజినెస్‌ పెట్టుకున్న వారు కొందరు ఉంటే చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. శిక్షణ తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సర్టిఫికెట్‌తో మంచి గుర్తింపు లభిస్తుంది. వారు ఎక్కడ ఉద్యోగం చేసినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం మంచి ఆదరణ ఉన్న కోర్సులను, ఎక్కువ కాలం ఉపాధి కల్పించే కోర్సుల్లో శిక్షణ
ఇస్తున్నందున నిరుద్యోగులు మంచి అవకాశాలు పొందవచ్చు. ఇందిరాపార్కు సవిూపంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 17 సెంటర్‌లను ఏర్పాటు చేసి విజయవంతంగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస యోజనలో భాగంగా శిక్షణ ఇచ్చి అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్లు అందించి, జాగృతి సభ్యులే ఉద్యోగ అవకాశాలు అందించే విధంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతగా చురకుగా జాగృతి పాల్గొన్నదో ఇప్పుడు అంతే ఉత్సాహంగా నిరుద్యోగ యువతకు దారి చూపే విధంగా కార్యాచరణ చేస్తోంది. అలాగే ఉపాధి శిక్షణతో పాటు స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కంప్యూటర్‌  కోర్సులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందిం చాలనే దృఢమైనలక్ష్యంతో తెలంగాణ జాగృతి నిర్వాహకులు కృషి చేస్తున్నారు. అర్హతలు బట్టి మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తి అయిన వెంటనే సర్టిఫికెట్‌ అందించి ఉపాధి మార్గం చూపుతున్న జాగృతి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది. ఎంపీ కవిత ఆధ్వర్యంలో సాగుతున్న జాగృతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు ఎంతోమందికి జీవనోపాధిగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న జాగృతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో బ్యూటీ వెల్‌నెస్‌, లాజిస్టిక్స్‌, రిటైల్‌ విభాగాల్లో శిక్షణను అందిస్తున్నారు. అదనంగా ఆసక్తి ఉన్నవారి కోసం స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ కోర్సులు నేర్పిస్తున్నారు. ఈ విభాగాల్లో యువతీయువకుల విద్యార్హతలను బట్టి కోర్సుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీలలో పాసైనా, ఫెయిల్‌ అయినా వారందరూ కోర్సుల్లో చేరడానికి అవకాశాలు కల్పించారు. జాగృతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల ద్వారా శిక్షణ తీసుకుంటున్న వారికి తప్పకుండా ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు. శిక్షణ తరగతులకు చాలా మంది యువతీ యువకులు వస్తున్నారు. తరగతుల్లో నేర్పుతున్న విధానం చాలా బాగుంది. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందని నమ్మకం ఏర్పడింది. జాగృతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లో నేర్పించే కోర్సులు బయట నేర్చుకుంటే చాలా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉచితంగా.. చాలా బాగా నేర్పిస్తున్నారు. ఉపాధి శిక్షణ తరగతుల్లో చేరడంతో మేము స్వతహాగా ఎవరిపై ఆధారపడకుండా బతకగలమన్న భరోసా వచ్చింది.