యువత క్రీడల్లో రాణించాలి – ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ డోర్నకల్ జూన్ 13 జనం సాక్షి

క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులకు సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.రాష్ట్ర వ్యాప్తంగా ఊరుకో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్న విషయం విధితమే.ఇందులో భాగంగా మండల పరిధి బొడ్రాయి తండా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా ఆటస్థలాన్ని ఏర్పాటు చేసుకున్న గ్రామ సర్పంచ్ తేజావత్ గామ్మిరాజు సోమవారం ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.ఇప్పటికే హరితహారం,పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాని నందన వనంగా రూపుదిద్దుతున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ వాలీబాల్,కోకో ఆడి యువకులు జోష్ నింపారు.అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ యువత క్రీడల్లో రాణించుటకు పల్లె క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు.అన్ని సౌకర్యాలతో సుమారు ఎకరం స్థలంలో బొడ్రాయి తండా గ్రామ క్రీడా మైదానం ఏర్పాటు చేయడం చుట్టు నీడ నిచ్చే చెట్లను నాటడం ఎంతో ఆహ్లాదకరంగా మారిందన్నారు.ఆరోగ్యం.. మానసికోల్లాసం.. శారీరక ధారుడ్యానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయి అన్నారు. ఆరోగ్యవంతులైన పౌరులను తయారు చేయాలంటే క్రీడలు ఎంతో అవసరం అని పేర్కొన్నారు.బొడ్రాయి తండా ‘తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని గ్రామ యువత సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సర్పంచ్ గామీ రాజు నాయక్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ బాలు నాయక్,జెడ్పిటిసి కమల రామనాథం,ఎంపీడీవో అపర్ణ,ఎమ్మార్వో వివేక్,మున్సిపల్ చైర్మన్ వీరన్న,వైస్ ఎంపీపీ తుమ్మల వెంకటరెడ్డి,ఎస్టి సెల్ మండల అధ్యక్షులు బానోతు నంద నాయక్ వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్ భాస్కర్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Attachments area