రక్తం చిందకుండా ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్లాం

– ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ వదిలిపోతారన్నారు
– గ్రేటర్‌ ఎన్నికల్లో 144 స్థానాల్లో గెలుపొందాం
– దేశంలో తెలంగాణ కంటే 17 చిన్న రాష్టాల్రు ఉన్నాయి
– పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం
– అభివృద్ధిలో ఏపీ, తెలంగాణకు పోలిక లేదు
– ప్రజలు కోరుకుంటే.. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌
– భాజభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి
– మేము ఎవ్వరితో కలవం స్వతంత్రంగానే ఉంటాం
– ఎవరైనా పొత్తులు పెట్టుకోవాలంటే మాకాడికే రావాలి
– ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదు.. తనకు తెలంగాణ అభివృద్ధే ప్రధానం
–  ఇండియా టుడే సౌత్‌కాన్‌  క్లెవ్‌-2018 కార్యక్రమంలో  సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు ఏడు దశాబ్దాల కల అని.. ఈ పోరాటాన్ని
తానొక్కడే ప్రారంభించలేదని.. ఎంతో మంది పోరాట ఫలితమే నని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. హింసకు తావులేకుండా పదేళ్ల పాటు నిరంతర శ్రమతో తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఆశయాన్ని సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం ఓ స్ఫూర్తినిస్తుందన్నారు. ఇది ఒక పాఠం లాంటిదన్నారు సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో ఇండియాటుడే సౌత్‌కాన్‌ క్లెవ్‌ -2018 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఉద్యమంలోకి దూకేముందు  3 -4 వేల గంటలు పని చేశామన్నారు. ఒక వ్యూహంతో.. ప్రణాళికతో దశాబ్దంపాటు ఉద్యమం చేశామన్నారు.  /ూష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి చెందుతూనే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూన్నామన్నారు. కాగ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. గత రెండేళ్లుగా దేశంలోనే నెంబర్‌ వన్‌ గా ఉన్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. 16 అంశాల్లో ముందున్నామన్నారు. తెలుగు గుర్తింపులో చీలిక తీసుకొచ్చారా అని ప్రశ్నించగా..  అలాంటిదేవిూ లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలుగు గుర్తింపు చీలిక అనేదే లేదని, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అన్నారు. ఈ రెండింటికి చాలా తేడా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రాలను కలిపేటప్పుడు చాలా మంది వ్యతిరేకించారని, ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు అనేది ఓ విఫల ప్రయత్నమని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్‌ లో సంపదలు సృష్టించింది ఉత్తరాధి వాళ్లేనన్నారు. పాతబస్తీలో గుల్జార్‌ హౌజ్‌ దీనికి నిదర్శనమన్నారు. ఇప్పటికి వాళ్లు హైదరాబాదీలుగా చెప్పుకుంటారని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ఉద్యమం సమయంలో తప్పుడు లెక్కలతో తప్పుడు ప్రచారం చేశారని, హైదరాబాద్‌ ను వదిలిపోతారని  అన్నారని  కసీఆర్‌ తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఇది తప్పని రుజువైందన్నారు. మా సహచర పార్టీతో కలిసి 150 సీట్లకు గాను 144 సీట్లు గెలిచామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ను ఎవరూ వదిలిపోలేదన్నారు. దేశ ప్రజలు కోరుకుంటే హైదరాబాద్‌ ను రెండో రాజధానిగా చేయడంలో ఎలాంటి నష్టం లేదని కేసీఆర్‌ తెలిపారు. దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని, స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామన్నారు. మన ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశానికి రాజధానిగా హైదరాబాద్‌ చేస్తారనడంలో తప్పు లేదన్నారు. దేశానికి తెలంగాణ మోడల్‌ వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. దేశంలో హైదరాబాద్‌ చిన్న రాష్ట్రం కాదని, దేశంలో మాకంటే 17 రాష్టాల్రు చిన్నవి ఉన్నాయన్నారు. జనాభాలో మాకంటే 12 రాష్టాల్రు వెనక ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇక్కడ మానవ వనరులను అద్భుతంగా ఉపయోగించుకుంటున్నామని, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని, మాకు ఎవరితో పోలిక లేదన్నారు.
తెలంగాణ, ఆంధ్రాకు పోలిక లేదు..
ఆంధ్రాకు తెలంగాణకు చాలా తేడా ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. రెండు ప్రాంతాల ప్రజల జీవన విధానం వేరన్నారు. తెలుగు అనే ఐడేంటీనే లేదని, భాషాప్రయుక్త రాష్టాల్ర పేరుతో ఆంధ్ర – తెలంగాణ విలీనం చారిత్రక తప్పిదమని, నిజాం హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వర్థిల్లిందన్నారు.
300 ఏళ్లక్రితం మార్వాడీలు హైదరాబాద్‌ వచ్చి తెలంగాణ మా మాతృభూమి అని గర్వంగా చెప్పుకుంటున్నారని, ఆరు నెలల్లోనే విద్యుత్‌ సంక్షోభం నుంచి బయటపడ్డామన్నారు. ఇప్పుడు 24 గంటల కరెంట్‌ ఇచ్చే స్థితికి చేరుకున్నామని సీఎం తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్టాల్ర కంటే ముందుందన్నారు. తెలంగాణ కంటే 17 చిన్న రాష్టాల్రు ఉన్నాయి. గ్రావిూణ
ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తున్నం. 38 లక్షల గొర్రెలను పంపిణి చేసి అనుకున్న లక్ష్యం దిశగా పోతున్నాం. రూ.100 ఉన్న ఆసరా పెన్షన్‌ను రూ. 1000కి పెంచాం. వ్యవసాయంలో కూడా తెలంగాణ ఆదర్శంగా నిలవబోతున్నది. దేశంలోనే తెలంగాణ అగ్రరాష్ట్రంగా నిలుస్తుందనే నమ్మకంతోనే రాష్టాన్ని సాధించుకున్నామన్నారు. పట్టుదలతో అభివృద్ధి సాధించి ఆచరణలో చూపామని సీఎం తెలిపారు.
జనభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి..
ముస్లిం రిజర్వేషన్లపై ఆయన స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న 50శాతం కోటా ఏమాత్రం సరిపోదని అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను గుజరాత్‌, సింగపూర్‌తో పోల్చడం సరికాదన్నారు. ప్రస్తత సెక్రటేరియట్‌ భవనం ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని కేసీఆర్‌ తెలిపారు. మలేషియా మంత్రి ఒకరు నేరుగా తనకే ఈ విషయం చెప్పారని కేసీఆర్‌ వివరించారు. ఉమ్మడి పాలకులు హైదరాబాద్‌ అభివృద్ధిని విస్మరించారన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని పునర్‌ నిర్మించడానికి రూ.25వేల కోట్లు ఖర్చు అవసరమని అన్నారు. పార్టీపై ప్రజలకు విశ్వాసం పెరిగే కొద్దీ నాయకుడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన తెలిపారు. నా కుటుంబ సభ్యులు తెలంగాణ కోసం జైలుకు వెళ్లారన్నారు. వారిని తెలంగాణ ప్రజలు ఎన్నకున్నారని.. తాను ఎవరినీ ఎంపిక చేయలేదని చెప్పారు. భవిష్యత్తులో రైతు ఆత్మహత్యలు ఉండవని భరోసా ఇచ్చారు. 2020 నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. తనకు రాష్ట్రమే ప్రధానమని తన మనసులో మాట బయటపెట్టారు.  పొత్తుల విషయమై ప్రశ్నింగా..తాము ఎవరితోనూ కలవమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఒకవేల పొత్తుల విషయమై ఆసక్తి ఉన్నవారు మా దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిస్తామని స్పష్టం చేశారు.