రక్తదానం చేసి అభిమానం చాటుకున్న అనిల్ డాక్టర్ అభిమానులు

 

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ జనవరి 31 జనం సాక్షిభైంసా పట్టణంలోని జిడిఆర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్అనిల్ కుమార్ 44వ జన్మదిన వేడుకలను అభిమానులు, యువకులుఘనంగా జరిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కి పలువురు రాజకీయాలకు ఆతీతంగా శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. దాదాపు 20 మంది యువకులు రక్తదాన0 చేసి, అభిమాన0ను చాటారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ ఆవాస విద్యార్థులకు ఉచిత బట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి తో సామూహిక భోజనాలు చేశారు.