రహదారి భద్రతపై ట్రాఫిక్‌ పోలీసుల అవగాహన

రంగారెడ్డి,జూన్‌7(జ‌నం సాక్షి): రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ డిసిపి ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో స్టేషన్‌ ఆవరణంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనిది వాహనాలు నడపకూడదని అన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలకు ప్రమాదామని అన్నారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకుడదని సూచనలు ఇచ్చారు. షాద్‌ నగర్‌ పట్టణంలో ఉన్న ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ పట్టణంలో రోడ్లపై ఉన్న షాప్‌ యాజమానులు స్థలానికి మించి రోడ్లపై ఉన్న స్థలాలను అద్దెలకు ఇవ్వకూడదని తెలియజేశారు. దాని వల్ల ట్రాఫిక్‌ జామ్‌ కావడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పట్టణ ప్రజలు పోలీసులకు సహరించగలరని చెప్పారు. ,ఈ కార్యక్రమంలో శంషాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ ప్రసాద్‌, ,షాద్‌ నగర్‌ ఏసీపీ,సురేందర్‌,షాద్‌ నగర్‌ టౌన్‌ సిఐ,అశోక్‌ కుమార్‌,షాద్‌ నగర్‌,ట్రాఫిక్‌ సిఐ సునీల్‌,పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.