రాకెట్‌ యుగంలో గుడ్డి నమ్మకాలు

– అంగవైకల్యం పోవాలని పిల్లల్ని మెడ వరకు పాతిపెట్టిన తల్లిదండ్రులు
– సూర్యగ్రహణం రోజు మూఢనమ్మకం..
బెంగళూరు,డిసెంబర్‌ 26(జనంసాక్షి):గురువారం సూర్యగ్రహణం పూర్తయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ సూర్యగ్రహణాన్ని తిలకించగా.. ఆలయాలు మూతపడ్డాయి. ఇక సూర్యగ్రహణం రోజు షరా మూమూలే అన్నట్లు మూఢ నమ్మకాలతో కొందరు రెచ్చియారు. పసివాళ్ల పట్ల మూర్ఖంగా ప్రవర్తించారు. పాత నమ్మకాల పేరుతో వాళ్ల ప్రాణాలను చిక్కుల్లో పెడుతున్నారు. కర్ణాటక విజయ్‌పూర్‌ జిల్లా అర్జునగి పీకే గ్రామంలో దారుణం జరిగింది. మూఢ నమ్మకాల పేరుతో వింత పోకడలకు పోయారు.. పిల్లల్ని మెడ వరకు నేలలో పాతిపెట్టారు. సూర్యగ్రహణం రోజు పాతిపెడితే అంగవైకల్యం పోతుందని తల్లిదండ్రుల మూఢనమ్మకం. అందుకే పిల్లల్ని ఇలా పాతిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే జనవిజ్ఞాన వేదిక సభ్యులు మాత్రం ఇది మూర్ఖత్వపు చర్య అని మండిపడుతున్నారు. నేలలో ఇలా పాత పెడితే అంగవైకల్యం ఎలా పోతుందని ప్రశ్నిస్తున్నారు. ఇటు అనంతపురం జిల్లాలో కూడా సూర్యగ్రహణం ప్రభావంతో మహిళ వింత ఆచారాలను పాటిస్తున్నారు. కళ్యాణదుర్గంలో జిల్లేడు చెట్లకు తాయెత్తులు కట్టారు. గ్రహణం రోజు అరిష్టం జరగకూడదని మహిళల ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం విూద కొందరు సూర్య గ్రహణం రోజు తమ, తమ వింత ఆచారాలతో జనాలకు ఒకింత షాకిస్తున్నారు.