రామాలయం కోసం యాగనిర్వహణ

అయోధ్య,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): విశ్వవేదాంత సంస్థాన్‌ ఇప్పుడు ‘అయోధ్య చలో’ నినాదాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో శనివారం 4వ తేదీవరకూ అయోధ్యలో అశ్వమేధయాగాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు శనివారం యగాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ఆనంద్‌ జీ మహారాజ్‌ మాట్లాడుతూ ‘రామ మందిరం నిర్మాణం కోసం చేపడుతున్న ఆందోళన.. ప్రజా ఆందోళనగా మారడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అయోధ్యలో రామ మందిరం నిర్మించక తప్పదు. మరి ఎందుకింత జాప్యం? ప్రధాని ఇప్పటికైనా ప్రధానమంత్రి రామ మందిరం నిర్మాణం తేదీని ప్రకటించాలి. ప్రస్తుతం మేము నిర్వహిస్తున్న యాగంలో వెయ్యిమంది రుత్విక్కులు పాల్గొంటున్నారు. 11 వేల మంది సన్యాసులు హాజరవుతున్నారు. ఆలయ నిర్మాణానికి ఈ యాగమే మొదటి అడుగు’ అని అన్నారు.