రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌

 హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ శుక్ర వారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రానికి సరఫరా కానుంది. తొలిరోజు 700 మెగావాట్లు పొందేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో షెడ్యూ లింగ్‌ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ జెన్‌కో నిర్మించిన వెయ్యి మెగావాట్ల మార్వా విద్యుత్‌ ప్లాం టు నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా కానుంది. ఈమేరకు ఆ రాష్ట్ర విద్యుత్‌ సంస్థతో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు రెండేళ్ల కిందట ఒప్పందం కుదు ర్చుకున్న విషయం తెలిసిందే. యూనిట్‌కు రూ.3.90 తాత్కాలిక ధరతో విద్యుత్‌ కొను గోలుకు తెలంగాణ ఈఆర్‌సీ ఇప్పటికే అనుమతించింది.

మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్‌పల్లి మీదుగా మహేశ్వరం వరకు 765 కేవీ సరఫరా సామర్థ్యంతో పీజీసీఎల్‌ నిర్మించిన విద్యుత్‌ కారిడార్‌ నిర్మాణం పూర్తవడంతో ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ రాకకు మార్గం సుగమమైంది. ఈ కారిడార్‌లో ఇప్పటికే వెయ్యి మెగావాట్ల లైన్లను రాష్ట్రం బుక్‌ చేసుకుంది. వచ్చే సెప్టెంబర్‌ నుంచి ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన విద్యుత్‌ సమీకరించేందుకు మరో వెయ్యి మెగావాట్ల కారిడార్‌ను రాష్ట్రం పొందనుం దని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.