రాష్ట్ర ఆదాయం తగ్గదు: ఈటెల

etelarajenderహైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత కొంత ఇబ్బందులు వచ్చాయని, అయితే దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌లో కొత్తగా చేర్చిందేమీలేదన్నారు. స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆదాయం 55శాతం పెరిగిందని, సేల్స్‌ ట్యాక్స్‌ ఆదాయం 22శాతం పెరిగిందని వివరించారు. రెవెన్యూలో 13శాతం వృద్ధి ఉందన్నారు. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఆదాయం రావడంలేదని ఈటెల తెలిపారు