రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు

మిర్యాలగూడ. జనం సాక్షి స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ఈనెల 20 , 21 తేదీలలో మిర్యాలగూడ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలకు స్వదేశీ స్పోర్ట్స్ వెల్ఫేర్ మిర్యాలగూడ & దా నల్గొండ డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో యొక్క వాల్ పోస్టర్స్ ను మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి వై వెంకటేశ్వరరావు గారు చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది స్వతంత్ర వజ్రోత్సవాలు సందర్భంగా పోటీలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ పోటీలను నిర్వహించుట జరుగును విజేతలకు 30 వేల నగదు బహుమతి అందజేసినట్లు ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ మాశెట్టి దివ్యశ్రీ అన్నారు ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 18వ తేదీ లోపు తమ వివరాలను 9581760789, 8985686228 నెంబర్లకు వాట్స్అప్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా స్వదేశీ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మిర్యాలగూడ ఉపాధ్యక్షులు కీర్తి అశోక్ పేర్కొన్నారు చెస్ టోర్నమెంట్లో మధ్యాహ్నం భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాశెట్టి శ్రీనివాస్( డైమండ్ బేకరీ) , జంగం ధర్మేంద్ర , వంగ శివ , భూపతి రాజేష్ , జయని నేతాజీ , తదితరులు పాల్గొన్నారు