రికార్డుల ప్రక్షాళనకు సహకరించాలి

కొత్తగూడెం,నవంబర్‌28(జనం సాక్షి): రైతులు తమకు సంబంధించిన ఆధారాలను రెవెన్యూ అధికారులకు చూపి రికార్డుల ప్రక్షాళనలో సహకరించాలని అధికారులు పేర్కొన్నారు. ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా వేలాదిమందికి శ్రమ లేకుండా వారసత్వ పట్టాలు లభించాయని, విచారణలో రెవెన్యూ అధికారులు పోషించే పాత్ర ప్రశంసనీయమని అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. రైతులకు తమ భూముల విూద హక్కు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. తమ ప్రాంతాలకు వచ్చిన అధికారులకు రైతులు తమ వద్ద ఉన్న ఆధారాలు చూపి ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. క్రయ, విక్రయాల సమయంలో తెల్ల కాగితంపై రాసుకోకుండా రెవెన్యూ అధికారుల సలహాలు పాటించి భవిషత్‌లో ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలని సూచించారు. భూమి ప్రక్షాళన చేసిన రికార్డలను ఆయన పరిశీలించారు. ప్రజల వద్ద నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఆయన స్వీకరించి పలు సూచనలు చేశారు.