రెండవదశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9న శంకుస్థాపన – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ రెండవ దశ నిర్మాణం పనులను ఈనెల 9న ఘనంగా ప్రారంభించనున్నట్లు, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లు ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను వెచ్చించి గచ్చిబౌలి మైండ్ స్పేస్ సెంటర్ నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో ట్రైన్ ఏర్పాటుకు కోనుకోవడం జరిగిందన్నారు. హైదరాబాద్ మహానగరం అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటని, అందుకు అనుగుణంగానే తెరాస ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టిందన్నారు. మైండ్ స్పేస్ సెంటర్ నుండి ఐటీ కారిడార్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రవాణా సౌకర్యం ఎంతో మెరుగవ్వడంతోపాటు వేగంగా రాకపోకలు సాగించడానికి మార్గం సులవవుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా వరకు ఫ్లవర్ బ్రిడ్జిల నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సమస్యను ప్రభుత్వం అదుపులోకి తేగలిగిందని, మరో 50 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులైన మంచినీరు, ఉపాధి, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం జరిగిందని అరికెపూడి గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగారావు, రవీందర్ ముదిరాజు, మాజీ కౌన్సిలర్లు విరేశం గౌడ్, మోహన్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,బాలింగ్ గౌతమ్ గౌడ్, రాజు నాయక్, సమ్మారెడ్డి, BSN కిరణ్ యాదవ్, లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, దామోదర్ రెడ్డి, గంగాధర్, అనిల్ రెడ్డి,తెరాస నాయకులు చంద్రిక ప్రసాద్, గుడ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ గోపారాజు, ఓ.వెంకటేష్, నర్సింహ రాజు తదితరులు పాల్గొన్నారు.