రెండు రోజుల్లో చర్చలు…  కొలిక్కి వస్తాయి 

– తెజస గుర్తుపైనే తాము పోటీ చేస్తా
–  తెజస వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం
హైదరాబాద్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని, మరో రెండు రోజుల్లో చర్చలు కొలిక్కి వస్తాయని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాటుపై తెజస, కాంగ్రెస్‌ ముఖ్యనేతల శుక్రవారం లక్డీకాపూల్‌లోని ఓ ¬టల్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ రాష్ట్ర బాధ్యుడు ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా తెజస అధ్యక్షుడు కోదండరాం, దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు. కూటమిలోని ఏయే పార్టీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. పొత్తులపై రెండు రోజుల్లో పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు. తాము కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయబోమని స్పష్టంచేశారు. ఎన్నికల సంఘానికి తమ పార్టీకి గుర్తింపు వచ్చిందని, త్వరలోనే తమ పార్టీకి గుర్తు కూడా వస్తుందని వివరించారు. ఇప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తయిందని, తమ గుర్తురాగానే తమ పార్టీ గుర్తువిూదే తమ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టంచేశారు. చర్చలు జరుగుతున్న దశలో వివరాలు బయటకు వెల్లడించడం సరికాదన్నారు. శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీనిని కలుస్తారాని విలేకరుల అడిగిన ప్రశ్నకు స్పందించిన కోదండరాం కలవడం లేదన్నారు. అది కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తిగత సభ అని అక్కడ తనకేం పని అని అన్నారు. ఇక తెరాస మ్యానిఫెస్టో పై మాట్లాడటానికి ఏవిూలేదన్నారు. వాళ్ల మేనిఫెస్టోపై మాట్లాడేకంటే తాము తమ మేనిఫెస్టోను ప్రకటించుకుంటామన్నారు. ఒకవేళ మాట్లాడటానికి కూడా తెరాస మేనిఫెస్టోలో కొత్తగా ఏవిూలేదన్నారు. అయితే, మొత్తం 16సీట్లకు తెజస పట్టుబట్టగా.. తొమ్మిది సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉత్తమ్‌ విూడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.