“రేగళ్ల “కు విద్యా సేవా పురస్కార్ అవార్డు

బోనకల్ ,నవంబర్ 21 (జనం సాక్షి):
బోనకల్: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం లోని టిఎన్జీవో ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బోనకల్ లోని షైన్ హై స్కూల్ లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రేగళ్ల వాణీ శైలజ విద్యా సేవా పురస్కార్- 2022 అవార్డు ను తెలంగాణ తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేతుల మీదగా అవార్డును అందుకున్నారు. విద్యార్థులకు విద్యాబోధనలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను టిపీటీఎఫ్ జిల్లా కమిటీ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత వాణి శైలజ మాట్లాడుతూ… విద్యార్థులకు విద్యాబోధన ద్వారా మరింత సేవలు అందించేందుకు కృషి చేస్తానని, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కు ఎంపిక చేసిన టిపిటిఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షబ్బీర్ అలీ, ఏపీ పీఎల్ఏటియు అధ్యక్షుడు అంబేద్కర్, నారాయణ స్కూల్స్ ఎజిఎం కోటేశ్వరరావు, ఐఐ టి ప్రొఫెసర్ వంశీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి నవీన్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు కొరకొప్పు రామారావు, జిల్లా, డివిజన్ కమిటీలకు, షైన్ హైస్కూల్ కరస్పాండెంట్ యారమాల సంజీవరెడ్డి, ప్రిన్సిపాల్ పుచ్చకాయల నాగేశ్వరరావు, ఉపాధ్యాయ, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.