రేపే ఈసెట్.. ఫస్ట్ టైమ్ ఆన్ లైన్ ఎగ్జామ్

తెలంగాణ ఈసెట్‌ కు సర్వసిద్ధమైంది. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. శనివారం జరగనున్న ఈసెట్‌కు 25,138 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో 81 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, ఖమ్మంలో ఐదు, వరంగల్‌లో ఆరు, హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో 65 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పరీక్ష జరగనుంది. పరీక్షకు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సి ఉన్నందునా అభ్యర్థులు మధ్యాహ్నం 12.30లకు కేంద్రాలకు చేరుకోవాలని కన్వీనర్‌ ఆచార్య ఎ.గోవర్దన్‌ సూచించారు. రెండు గంటలకు పరీక్ష ప్రారంభమైన అనంతరం ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదన్నారు.