రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయవేత్త

డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నాడు
ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మఠాష్‌
మంత్రి మల్లారెడ్డి ఘాటు విమర్శలు
హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తీరుపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్‌ అని అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నారని ఆరోపించారు. రేవంత్‌ చివరకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ను కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తారన్నారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గుడని.. బట్టేబాజ్‌ అంటూ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌ది రచ్చబండ కాదని.. లుచ్చాబండ అంటూ దుయ్యబట్టారు. రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్‌ అవుతుందన్నారు. నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌తో అనేక ఇబ్బందులు పడ్డా. టీడీపీలో ఉన్నప్పుడు నన్ను కూడా రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. నా కాలేజీలు మూసివేయిస్తానని బెదిరించాడు. మల్కాజ్‌గిరి సీటు రాకుండా అడ్డుకునేందుకు యత్నించాడు. చంద్రబాబుకు వాస్తవాలన్నీ చెప్పి సీటు తెచ్చుకుని..గెలిచా అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. రచ్చబండ పేరుతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వివేక్‌ విమర్శించారు. టీపీసీసీ చీఫ్‌ హోదాలో చిల్లర రాజకీయాలు మానాలని హితవు పలికారు. టీపీసీసీ అంటే చీటర్స్‌ కమిటీగా మారిందన్నారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ కాగితాలకే పరిమితమైందన్నారు. డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ నాయకులే నమ్మడం లేదని వివేక్‌ పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీఆర్‌ఎస్‌ నేత దానం నాగేందర్‌ విమర్శించారు. అభివృద్ధి రేవంత్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్‌ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. రెడ్డిల చేతిలో అధికారం ఉండాలన్న రేవంత్‌ వ్యాఖ్యలపై భట్టి, వీహెచ్‌ ఇతర నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్‌ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దానం నాగేందర్‌ పేర్కొన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ పెట్టాలని ఆనాడే తాము కోరామన్నారు. హైదరాబాద్‌కు సుంకిషాల నీళ్లు తేవాలంటే పట్టించు కోలేదన్నారు. ఇప్పుడు రేవంత్‌ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్థ సారథి రెడ్డి మార్కెట్‌ రేట్‌ ప్రకారమే రెమిడెసివర్‌ ఇచ్చారన్నారు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. అలాంటి వ్యక్తి విూద జగ్గారెడ్డి బురద జల్లడం సరికాదని దానం నాగేందర్‌ హితవు పలికారు.