రైతులకు అడంగా నిలిచిన ప్రభుత్వం: జూపల్లి

వనపర్తి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): దేశంలోనే తొలిసారిగా రైతులకు జీవిత బీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ వచ్చినందుకే వ్యవసాయరంగం అభివృద్ధి చెందడంతో పాటు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని శాగాపూర్‌, మాధవరావుపల్లి, కిష్టాపూర్‌ తండాలలో పర్యటింటి రైతులతో మాట్లాడారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ త్వరలోనే పెండింగ్‌ కాలువలను పూర్తి చేయిస్తామని, రైతులు ఎలాంటి అనుమానాలను పెట్టుకోవద్దని సూచించారు. శ్రీశైలం డ్యాంలో నీరున్నంత వరకు సాగునీటికి ఢోకా లేదని, ఇక నుంచి రెండు పంటలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
మాధవరావుపల్లి, రేమొద్దుల గ్రామాల సవిూపంలో రైతులతో మాట్లాడుతూ బీడు భూముల్లో జలసిరులు సంతరించుకున్నాయని, రానున్న కాలంలో వ్యవసాయం రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులను పొందాలని సూచించారు. ఒకవైపు సాగునీరు, మరోవైపు నిరంతర విద్యుత్‌ అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలిపారు. వచ్చే నెల 3,4,5,6 తేదీలలో కొల్లాపూర్‌లో సంబురాలను నిర్వహించనున్నామని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.