రైతులకు ప్రైవేట్‌ డెయిరీల గాలం?

వరంగల్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): పాడి రైతులకు విజయ డెయిరీ లీటరుకు రూ.4 నగదుగా చెల్లిస్తోన్న  ప్రోత్సాహకం పథకం అందుతున్న గిట్టుబాటు కావడం లేదన్న భావన రైతుల్లో ఉంది. ప్రతి నెల బిల్లులు చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తున్నామన్నారు. ఈ పథకం రద్దయ్యిందన్న వార్తల్లో నిజం లేదంటున్నారు.  నెలలు గడుస్తున్నా నిధులు మంజూరు కాకపోవడంతో ప్రోత్సాహక పథకం ఉందా లేదా? అనే సంశయంలో పాడి రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇదే అదనుగా చేసుకొని ప్రైవేటు డెయిరీలు విజయ డెయిరీ చెల్లించే పాల ధర కన్న లీటరుకు రూ.4లు ఎక్కువ ఇచ్చి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాకపోవడంతో రైతులు ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గు చూపుతున్నారు. విజయ డెయిరీకి పాలు పోసే ప్రతి రైతుకు లీటరుకు అదనంగా రూ.4ల చొప్పున చెల్లిస్తోంది. ఈ ప్రోత్సహంతో పాడి రైతులు పాలను ప్రైవేటు డెయిరీలకు పోయకుండా విజయ డెయిరీకే పోస్తున్నారు. కొన్ని నెలలపాటు సక్రమంగా చెల్లించినా గత తొమ్మిది నెలలుగా నిధులు రాకపోవడంతో అనేకులు ప్రైవేట్‌ డెయిరీల వైపు మొగ్గు చూపుతున్నారు.  గతంలో రెండు, మూడు నెలలకోసారి ఇచ్చేవారని, అదనంగా ఇచ్చే డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా మంది రైతులు విజయ డెయిరీని వదిలి ప్రైవేటు డెయిరీల వైపు పోతున్నారు.