రైతులపై విత్తన భారం 

వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ సాగుకు రాయితీ విత్తనాల ధరలు ఖరారయ్యాయి. అయితే ఇవి భారం మోపనున్నాయని రైతులు అంటున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖలకు పంపించింది. విత్తనాలను మే మూడో వారం నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించింది. కొన్ని రకాల ధరలను 20 నుంచి 39 శాతం వరకు పెంచింది. ఫలితంగా రైతులు అదనపు భారం మోయాల్సి ఉంటుంది. ఈసారి కందులకు కనీస ధర రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఈ పంట విత్తనాల ధర రూ.39 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో రైతులు దీన్ని సాగు చేయడం కష్టమే. మినుము, జనుము, జీలుగ, పిల్లిపెసరదీ ఇదే పరిస్థితి. ఈ
విత్తనాలను భూసారం పెరిగేందుకు తొలకరి వర్షాలు కురువగానే వేసుకుంటారు. దీనివల్ల ఎరువుల వాడాకం
తగ్గుతుంది. ధరలు పెరగడంతో వేసుకోవడానికి ఆలోచిస్తారు. మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాల ధర ఎంత ఉన్నా అందులో కిలోకి రూ.25 చొప్పున సర్కారు రాయితీని ఇవ్వనుంది.